ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ బైక్‌ ఇదే.. మైలేజ్ ఎంతంటే ?

 ఢీల్లీకి చెందిన ఎలక్ట్రానిక్ బ్రాండ్ డెటెల్ ప్రపంచంలోని చౌకైన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం డిటెల్ ఈజీని రూ .19,999 (జీఎస్టీ మినహాయించి)కు విడుదల చేసింది. 

electronic brand Detel has launched world's cheapest electric two-wheeler Detel Easy at Rs 19,999

ప్రపంచంలోనే అత్యంత ఫీచర్ ఫీచర్ ఫోన్ ధర రూ .299, చౌకైనా టెవి ధర రూ. 3,999 తరువాత  ఢీల్లీకి చెందిన ఎలక్ట్రానిక్ బ్రాండ్ డెటెల్ ప్రపంచంలోని చౌకైన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం డిటెల్ ఈజీని రూ .19,999 (జీఎస్టీ మినహాయించి)కు విడుదల చేసింది.

ద్విచక్ర వాహనం 6 పైప్ కంట్రోలర్ 250 వాట్ ఎలక్ట్రిక్ మోటారుతో పనిచేస్తుంది, ఇది గంటకు 25 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలాదు. ఇందులో  48V 12AH LiFePO4 బ్యాటరీని అమర్చారు, ఇది పూర్తిగా 7-8 గంటల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది.  ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 60 కి.మీ వరకు వెళ్లగలాడు.

also read క్లాసి స్పోర్టీ స్టైలిష్ లుక్ తో రెనాల్ట్ డస్టర్ టర్బో వచ్చేసింది.. ధర ఎంతంటే ? ...

"ప్రపంచంలోనే అత్యంత చౌకైనా  డిటెల్ ఇవి టూ-వీలర్ లాంచ్ ప్రకటించినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము. పర్యావరణం పట్ల పెరుగుతున్న అవగాహన, పెట్రోల్ ధరలు పెరగడం, కఠినమైన ఉద్గార నిబంధనలు వంటి వివిధ అంశాల కారణంగా భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ అభివృద్ధి చెందుతోంది.

అలాగే, ఆర్థిక వ్యవస్థను పెంచడం, కాలుష్య స్థాయిలను తగ్గించడం, నగరంలో ఉపాధి కల్పించడం లక్ష్యంగా కొత్త 'ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ'ను ప్రారంభించడంపై ఢీల్లీ ముఖ్యమంత్రి శ్రీ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించడంతో, ఎలక్ట్రిక్ వాహనం వినియోగం గతంలో కంటే ఇప్పుడు పెరుగుతుంది.

మా పోర్ట్‌ఫోలియోలో అదనపూ నగరాల్లో వాహన కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నంలో ఇది మా మొదటి అడుగు అవుతుంది "అని డిటెల్ వ్యవస్థాపకుడు & సి‌ఈ‌ఓ యోగేష్ భాటియా చెప్పారు. గత వారం ఢీల్లీలో ప్రకటించిన కొత్త ఎలక్ట్రిక్ వాహనాల విధానం దేశ రాజధానిలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ఆర్థిక ప్రోత్సాహకాలను అందిస్తుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios