జపాన్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కవాసాకి తాజాగా కొత్త బిఎస్ 6 కంప్లైంట్ కవాసాకి నింజా 300 బైకుని విడుదల చేసింది. అయితే కవాసాకి  నింజా 300ను మాత్రం భారతదేశంలో ఇంకా విడుదల చేయలేదు, కానీ ఇండియాలో బాగా అమ్ముడవుతున్న బైకులలో కవాసకి ఒకటి.

2021 మొదటి త్రైమాసికం చివరిలో కొత్త బిఎస్ 6 నింజా 300ను భారతదేశంలో విడుదల చేయనున్నట్లు సంస్థ తెలిపింది. కవాసకి నింజా బీఎస్ 6 బైక్ ధర రూ.2.5 లక్షలు ఉండొచ్చు అని అంచనా. కానీ బిఎస్ 4 మోడల్ ధర రూ.2.98 లక్షలుగా ఉంది.

కవాసాకి నింజా బైక్ బాడీ ప్యానెల్లు, లైట్లు, బ్రేక్‌లు, టైర్లు మొదలైన స్థానికంగా తయారు చేసిన వాటిని ఉపయోగించింది. బిఎస్ 4 మోడల్‌లో 296 సిసి పారలేల్ ట్విన్ ఇంజన్ ఉంది, 39 బిహెచ్‌పి వద్ద 11,000 ఆర్‌పిఎమ్, గరిష్టంగా 27ఎన్‌ఎం టర్క్ వద్ద 10,000 ఆర్‌పిఎమ్ తయారు చేస్తుంది.

also read 2020లో లాంచ్ అయిన టాప్ 7 బెస్ట్ ఎస్‌యూవీ కార్లు ఇవే.. ...

ఈ బైక్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది, దీనికి స్లిప్పర్ క్లచ్‌తో స్టాండర్డ్ వస్తుంది. స్పెసిఫికేషన్లు, ఫీచర్స్, స్టైలింగ్‌ పరంగా  చిన్న మార్పులతో బిఎస్ 6 వేరియంట్ ఒకే విధమైన సెటప్ పొందే అవకాశం ఉంది.

కవాసాకి డబ్ల్యూ 175 లేటెస్ట్ క్లాసిక్ బైక్ కొన్ని వారాల క్రితం భారతదేశంలో మొదటిసారిగా కనిపించింది. కవాసాకి కొత్త డబ్ల్యూ  సిరీస్ బైక్ పూణే సమీపంలో టెస్ట్ చేసింది, ఇది భారతదేశంలో జపనీస్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ నుండి అతిచిన్న, బడ్జెట్ బైక్ అవుతుంది. కవాసాకి  డబ్ల్యూ 175 లాంచ్ తో కవాసాకి  200 సిసి బైక్స్ విభాగంలో పోటీ ఇవ్వనుంది.  

కవాసాకి డబ్ల్యూ 175 ఇప్పటికే థాయ్‌లాండ్, ఇండోనేషియా వంటి విదేశీ మార్కెట్లలో అందుబాటులో ఉంది. 177 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్, ఎస్‌ఓహెచ్‌సి ఇంజన్ తో పనిచేస్తుంది. పవర్‌ట్రైన్ ఆప్షన్ లో ఎటువంటి మార్పు కనిపించదని భావిస్తున్నాట్లు తెలిపింది.

ఇంజన్ 13 బిహెచ్‌పి కోసం ట్యూన్ చేయబడింది, 13.2 ఎన్ఎమ్ పీక్ టార్క్ను అభివృద్ధి చేస్తుంది, 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.