బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం రెండు విషయాలలో ఎంతో పాపులర్ అయ్యారు, ఒకటి అతని యాక్షన్ సినిమాలు రెండవది సూపర్ బైక్‌లపై తనకు ఉన్న మక్కువ. కరోనా మహమ్మారి కారణంగా కొత్త సినిమాలను విడుదల చేసి దాదాపు ఒక సంవత్సరం కావొస్తుంది, ఇటీవల జాన్ అబ్రహం తన బైక్ గ్యారేజీలోకి ఒక కొత్త సూపర్ బైక్‌ వచ్చి చేరింది.

అది సరికొత్త బి‌ఎం‌డబల్యూ ఎస్1000ఆర్‌ఆర్. తాజాగా ఒక సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించగా, అంతకుముందు పోస్ట్‌లో తన ఇతర సూపర్ బైక్‌లతో పాటు కొత్త ఎస్1000ఆర్‌ఆర్ ఫోటోను షేర్ చేశారు.

 జాన్ అబ్రహంకి సూపర్ స్పోర్ట్స్ బైక్స్ కలెక్షన్ ఉంది. వీటిలో కవాసకి నింజా జెడ్‌ఎక్స్-14ఆర్, అప్రిలియా ఆర్‌ఎస్‌వి4 ఆర్‌ఎఫ్, యమహా వై‌ఎఫ్‌జెడ్-ఆర్1, డుకాటీ పానిగలే వి4, ఎం‌వి అగుస్టా ఎఫ్3 800, యమహా విమాక్స్ ఉన్నాయి. వీటితో పాటు ఇప్పుడు బి‌ఎం‌డబల్యూ ఎస్1000ఆర్‌ఆర్, సి‌బి‌ఆర్ 1000ఆర్‌ఆర్-ఆర్ ఫైర్‌బ్లేడ్‌ బైక్స్ చేరాయి.

also read వాహనాలకు క్యూఆర్ కోడ్‌తో యూనిఫాం పియుసి సర్టిఫికెట్‌ తప్పనిసరి ఉండాలి: రవాణా శాఖ ...

జాన్ అబ్రహం వద్ద  ప్రముఖులు అసూయపడే అత్యంత  కాస్ట్లీ స్పోర్ట్స్ బైక్స్ కలెక్షన్ ఉంది అని ఖచ్చితంగా చెప్పగలం. కొత్తగా చేరిన రెండు బైక్‌లు బ్లాక్ షేడ్స్‌లో వస్తాయి, బిఎమ్‌డబ్ల్యూ బైక్ కలర్ ని బ్లాక్ స్టార్మ్ మెటాలిక్ అని పిలుస్తుండగా, హోండా పెయింట్ జాబ్‌ను మాట్టే పెర్ల్ మోరియన్ బ్లాక్ అని పిలుస్తారు.

బిఎమ్‌డబ్ల్యూ ఎస్ 1000 ఆర్‌ఆర్ బైక్ 999 సిసి, ఇన్-లైన్ ఫోర్-సిలిండర్ వాటర్ / ఆయిల్-కూల్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. 13,500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 203.8 బిహెచ్‌పిని అందించడానికి ఇంజిన్ ట్యూన్ చేయబడింది. 11,000 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ను అభివృద్ధి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ అందించారు.

 హోండా సి‌బి‌ఆర్1000ఆర్‌ఆర్ -ఆర్‌ ఫైర్‌బ్లేడ్ బైక్ 1000 సిసి ఇన్-లైన్ ఫోర్-సిలిండర్ 4-స్ట్రోక్ 16-వాల్వ్ DOHC లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌, 14,500 ఆర్‌పిఎమ్ వద్ద 214.5 బిహెచ్‌పిని తయారు చేస్తుంది,  12,500 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్‌ను అభివృద్ధి చేస్తుంది. దీనికి కూడా 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ ఉంటుంది.

జాన్ అబ్రహం చివరిగా విడుదల చేసిన మల్టీస్టారర్ కామెడీ మూవీ పాగల్ పంటి 2019 చివరలో విడుదలైంది. తన రాబోయే సినిమాల విషయానికొస్తే జాన్ అబ్రహం దర్శకుడు సంజయ్ గుప్తాతో  ముంబై సాగా, లక్ష్య రాజ్ ఆనంద్ ఎటాక్, మిలాప్ జావేరి సత్యమేవ జయతే 2 ఇది 2018 యాక్షన్ మూవీ సత్యమేవ జయతేకి సీక్వెల్.