కరోనా సంక్షోభంలోనూ బైక్స్ కొనుగోళ్ల జోరు..గతేడాది కంటే కాస్త ఎక్కువే..

కరోనా మహమ్మారి ప్రభావంతో మోటారు సైకిళ్ల విక్రయాలు గతేడాది మే నెలతో పోలిస్తే 25 శాతం పెరిగాయని డీలర్లు చెబుతున్నారు. ఇక కార్ల విక్రయాలు పడిపోవడంతో ఆటోమొబైల్ సంస్థలు, డీలర్లు ఆన్ లైన్ లో విక్రయాలకు చర్యలు చేపట్టారు. 
 

Bikes and Scooters demand pickup high  in  Telangana Districts

హైదరాబాద్/ న్యూఢిల్లీ: కరోనా విశ్వమారి సంక్షోభంలోనూ మోటారు సైకిళ్లు, స్కూటర్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. 2019 మే నెలలో కన్నా ఈ ఏడాది మే లో ద్విచక్ర వాహనాల విక్రయాలు 25 శాతం అధికంగా ఉండటం ఆసక్తికర పరిణామం.

లాక్ డౌన్ కారణంగా ఇన్ కమ్ తగ్గినా టూ వీలర్స్ విషయంలో ఆ ఎఫెక్ట్ ఏమీ కనిపించ లేదు. ప్రజా రవాణా తగ్గిపోవడంతోపాటు కరోనా ప్రభావంతో మున్ముందు పబ్లిక్  ట్రాన్స్ పోర్ట్‌లో ప్రయాణించాలంటే చాలా మంది భయపడతున్నారు. మరో ఆరు నెలల పాటు కరోనా ఎఫెక్ట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో చాలా మంది సొంతంగా బైక్‌లు కొనుక్కుంటున్నారని డీలర్లు పేర్కొంటున్నారు.

సాధారణంగా గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ పరిధిలోనే ద్విచక్ర వాహనాల విక్రయాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ సారి మాత్రం హైదరాబాద్ కన్నా ఇతర జిల్లాల్లో అమ్మకాలుఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రంలో లాక్‌‌డౌన్‌‌తో మార్చి 22 నుంచి బైక్‌లు, కార్ల షో రూమ్‌లు బంద్‌‌ అయ్యాయి. మే 16 వ తేదీ నుంచి మళ్లీ షో రూమ్‌లు తెరుచుకోవడంతో అన్ని జిల్లాల్లో మోటారు సైకిళ్లు, స్కూటర్ల అమ్మకాలు పెరిగాయి.

చాలా జిల్లాల్లో బస్సులు నడుస్తున్నా, కరోనా భయంతో ప్రయాణికులు ఎక్కటం లేదు. ఆటోలు, ఇతర ట్రాన్స్ పోర్ట్ వెహికిల్స్ లో వెళ్లటానికి కూడా ఇష్టపడటం లేదు. ఫిజికల్ డిస్టెన్స్ మెయింటెన్ చేస్తూ ప్రయాణం చేయాలంటే బైక్‌లపై వెళ్లటం మంచిదని భావిస్తున్నారు.

also read కరోనాపై పోరాడుతున్న వారికి టాటా మోటార్స్‌ స్పెషల్ ఆఫర్

ఈ కారణంగానే గతంలో కన్నా జిల్లాల్లో టూ వీలర్స్ సేల్స్ భారీగా పెరిగాయి. గ్రేటర్ పరిధిలో ఇప్పటికే టూ వీలర్స్ సంఖ్య 50 లక్షలు దాటింది. చాలా మందికి ఇప్పటికే బైక్స్, స్కూటర్లు ఉన్నాయి. పైగా లాక్ డౌన్ కారణంగా సొంతూళ్లకు వెళ్లటం వల్ల ఇన్ కమ్ తగ్గటంతో గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలో బైక్స్  అమ్మకాలు జిల్లాల్లో కన్నా తక్కువగా ఉన్నాయి.

టూ వీలర్స్ సేల్స్ బాగున్నా కార్ల విక్రయాలు మాత్రం పడిపోయాయి. గతేడాది మే తో పోల్చుకుంటే 50 శాతానికి పైగా కార్ల అమ్మకాలు పడిపోయాయి. దీంతో చాలా షో రూమ్స్ ఆన్ లైన్ బాట పట్టాయి. ఆన్ లైన్ లోనే షో రూమ్ వివరాలు, కార్ల వివరాలను పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

టెస్ట్ డ్రైవింగ్ కోసం ఇంటికే కార్లను పంపిస్తున్నారు. ఆన్ లైన్‌లో టెస్ట్ డ్రైవింగ్ ఆప్షన్ టిక్ చేస్తే కారును ఇంటికి పంపిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో  ఆన్ లైన్ కార్ల ఎంక్వైరీ పెరిగింది. అందుకు అనుగుణంగా షో రూమ్స్ యాజమాన్యాలు అప్ డేట్ అవుతున్నాయి. టెస్ట్ డ్రైవింగ్ తర్వాత కారు నచ్చితే ఆన్ లైన్ లో కార్ బుకింగ్  అవకాశం కల్పిస్తున్నారు.

లాక్ డౌన్ వల్ల ఆర్టీఏ కు ఆదాయం తగ్గినా ఇప్పుడు మళ్లీ పుంజుకుంటున్నది. గత నెల 16 నుంచి స్లాట్స్ ఓపెన్ కావటంతో క్రమంగా స్లాట్స్ సంఖ్య పెంచుతున్నారు. లాక్‌‌డౌన్‌‌‌కు ముందు 20 వేల స్లాట్స్‌‌ ఓపెన్‌‌గా ఉండేవి. ప్రస్తుతం సుమారు 14 వేల స్లాట్స్‌‌ ఓపెన్‌‌ చేస్తే, రోజు 10 వేల వరకు బుకింగ్స్‌‌ అవుతున్నాయి. ప్రారంభంలో రోజుకు కోటిన్నర ఆదాయం రాగా ప్రస్తుతం రూ.7. 5 కోట్ల మేర వస్తుందని అధికారులు చెబుతున్నారు.

‘రాష్ట్రంలో మోటారు సైకిళ్లు, స్కూటర్ల విక్రయాలు చాలా బాగున్నాయి. హైదరాబాద్‌‌ కన్నా జిల్లాల్లోనే  ఎక్కువ అమ్ముడవుతున్నాయి. పబ్లిక్‌ ట్రాన్స్‌‌పోర్ట్‌‌ తక్కువగా ఉండటమే కారణమని మేము భావిస్తున్నాం. ఆన్‌‌లైన్‌‌ అమ్మకాలపై దృష్టి పెట్టాం. సిటిలో ఆన్‌‌లైన్‌‌ ఎంక్వైరీస్  బాగా పెరిగాయి. కస్టమర్‌‌ షో రూమ్‌కు  రాకుండానే ఇంటికే టెస్ట్‌‌ డ్రైవ్‌‌ కార్లను పంపిస్తున్నాం. నచ్చితే తర్వాత బుక్‌‌ చేసుకోవచ్చు. జూన్‌‌ నుంచి సేల్స్‌‌ ఇంకా పెరుగుతాయని అంచనా వేస్తున్నాం’ అని పలువురు డీలర్లు అంటున్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios