దసరా స్పెషల్ కొత్త రంగులలో బజాజ్ పల్సర్ 200సిసి బైక్స్..
బజాజ్ ఇండియన్ మార్కెట్లోకి పల్సర్ కొత్త కలర్ ఆప్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. దసరా, దీపావళి పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని విడుదల చేసిన ఈ బైకును మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
ముంబై: ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఇండియన్ మార్కెట్లోకి పల్సర్ కొత్త కలర్ ఆప్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. దసరా, దీపావళి పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని విడుదల చేసిన ఈ బైకును మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
వీటిలో డ్యూయల్ చానెల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ కలిగిన పల్సర్ ఆర్‌ఎస్ 200 ధర రూ.1,52,179గాను, ఎన్‌ఎస్ 200 మోడల్ ధర రూ.1,31,219గా నిర్ణయించింది. అలాగే పల్సర్ ఎన్‌ఎస్ 160 మోడల్‌ను రూ.1,08,589కి విక్రయిస్తున్నట్లు తెలిపింది. ఈ ధరలు ఢిల్లీ ఎక్స్ షోరూంనకు సంబంధించినవి.
also read ఫెస్టివల్ సీజన్ కోసం మెర్సిడెస్ బెంజ్ కొత్త క్యాంపెయిన్ ...
పల్సర్ ఎన్ఎస్ 200లో 199సిసి ఫోర్-వాల్వ్ ఇంజిన్‌తో 24 హెచ్‌పిని, పల్సర్ ఎన్ఎస్ 160 బైక్ 17 హెచ్‌పిని ఇస్తుంది. పల్సర్ ఎన్ఎస్ 200 & ఎన్ఎస్ 160 నాలుగు కొత్త రంగులలో లభిస్తాయి. బర్న్ట్ రెడ్ (మాట్టే ఫినిష్), మెటాలిక్ పెర్ల్ వైట్, ప్యూటర్ గ్రే, ప్లాస్మా సాటిన్ బ్లూ కలర్ ఆప్షన్స్ తో పాటు కొత్త ఆల్-వైట్ అల్లాయ్ వీల్స్ కూడా లభిస్తాయి.
డ్యూయల్-ఛానల్ ఎబిఎస్ పల్సర్ ఆర్‌ఎస్ 200 ధర రూ .1,52,179 (ఎక్స్‌షోరూమ్, న్యూ ఢీల్లీ), పల్సర్ ఎన్ఎస్ 200 ధర రూ .1,31,219 (ఎక్స్-షోరూమ్, న్యూ ఢీల్లీ), పల్సర్ ఎన్ఎస్ 160 ధర రూ1,08,589 (ఎక్స్-షోరూమ్, న్యూ ఢీల్లీ). కొత్త కలర్ ఆప్షన్ ఆర్‌ఎస్ & ఎన్ఎస్ బైకులు 23 అక్టోబర్ 2020 నుండి బజాజ్ డీలర్‌షిప్‌లలో లభిస్తుంది.