యూత్ ని ఆకర్షిస్తున్న ‘బజాజ్’ పల్సర్ న్యూ వేరిఎంట్.. ధరెంతంటే?
భారతదేశ విపణిలోకి బజాజ్ ఆటోమొబైల్స్ కొత్త తరం పల్సర్ బైక్ ఆవిష్కరించింది. ‘125 స్ప్లిట్’ అనే పేరుతో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిన పల్సర్ బైక్ ధర రూ.79,091గా సంస్థ నిర్ణయించింది.
ముంబై: ‘బజాజ్ ఆటో’కు చెందిన పల్సర్ బైక్స్‌కు యువతలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా పల్సర్ 125 స్ప్లిట్ సీట్ వేరియంట్ పేరుతో గురువారం బజాజ్ ఆటో మార్కెట్లో విడుదల చేసింది.
ఈ బైక్ సింగిల్ సిట్ డ్రమ్ వేరియంట్ కలిగిన అత్యున్నత టెక్నాలజీతో రూపొందించామని బజాజ్ ఆటో తెలిపింది. ఈ బైక్‌లో కొన్ని అదనపు ఫీచర్లు వినిమోగదారులను ఆకర్షిస్తాయని బజాజ్ ఆటో పేర్కొంది.
బైక్‌లో రెగ్యులర్ మోడల్ సింగిల్ యూనిట్‌కు బదులుగా స్పోర్టి బెల్లీ పాన్, స్పిట్ గ్రాబ్ రైల్స్ వంటి కొన్ని అదనపు ఫీచర్లతో ఈ బైక్ అలరించనున్నది. కాగా పల్సర్ 125 బైక్ బ్లాక్ సిల్వర్, బ్లాక్ రెడ్, నియాన్ గ్రీన్ కలర్లలో మార్కెట్లో అందుబాటులో ఉంటాయని బజాజ్ ఆటో తెలిపింది.
అత్యాధునిక ఫీచర్లతో అలరించనున్న పల్సర్ 125 వేరియంట్ బైక్ ధర రూ.79,091గా సంస్థ నిర్ణయించింది. పల్సర్ 125 వేరియంట్ బైక్‌ను వినియోగదారులకు అందించడం పట్ల బజాజ్ ఆటో ప్రెసిడెంట్ సారంగ్ కనడే హర్షం వ్యక్తం చేశారు.
also read ఒకవైపు సరిహద్దుల్లో ఘర్షణ: మరో వైపు ఇండియాలో చైనా పెట్టుబడులు
సారంగ్ కనడే స్పందిస్తూ గత సంవత్సరం విడుదల చేసిన పల్సర్ 125 బైక్ కేవలం ఆరు నెలల్లోనే లక్ష మోటారు సైకిళ్లను కస్టమర్లు కొనుగోలు చేశారని అన్నారు. స్పోర్ట్స్ బైక్‌ను ఇష్టపడే వారికి సరికొత్త స్టైల్, థ్రిల్‌తో ఈ బైక్ అలరిస్తుందని తెలిపారు.
మారుతీ కార్లకు కరూర్ వైశ్యాబ్యాంక్ రుణాలు
కార్ల కొనుగోలుదారులకు ఆకర్షణీయమైన నిబంధనలు, వెసులబాట్లతో రుణ సదుపాయం కల్పించేందుకు కరూర్ వైశ్యా బ్యాంకు (కేవీబీ)తో ప్రముఖ ప్రయాణికుల కార్ల సంస్థ మారుతీ సుజుకీ ఒప్పందం కుదుర్చుకున్నది.
మారుతీ సుజుకీకి చెందిన ప్రస్తుత ఖాతాదారులు, కొత్త వారు కూడా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఓమ్నీ, ఈఈసీఓ మోడళ్లు మినహా కారు రోడ్డుపైకి వచ్చేందుకు అయ్యే మొత్తం ఖర్చును 100 శాతం కేవీబీ రుణంగా ఇస్తుంది. మొదటి ఆరు నెలలు రుణ వాయిదాలు చెల్లించాల్సిన అవసరం లేదని కరూర్ వైశ్యాబ్యాంక్ ప్రెసిడెంట్ జే నటరాజన్ తెలిపారు.