ద్విచక్ర వాహన సంస్థ బజాజ్ ఆటో అమ్మకాలు నవంబర్‌లో 5 శాతం పెరిగి 4,22,240 యూనిట్లను విక్రయించింది, అయితే పండుగ సీజన్ లో దేశీయ మార్కెట్ ఎటువంటి సానుకూల సంకేతాలను చూపించలేదు. 2019 నవంబర్‌లో కంపెనీ 4,03,223 వాహనాలను విక్రయించింది.  

గత ఏడాది ఇదే నెల నవంబర్ 2020లో దేశీయ అమ్మకాలు సుమారు 4% తగ్గాయని బజాజ్ ఆటో నివేదించింది. 2020 నవంబర్‌లో కంపెనీ 1,98,933 యూనిట్లను విక్రయించగా 2019 నవంబర్‌లో 2,07,775 యూనిట్లు విక్రయించినట్లు బిఎస్‌ఇకి పంపిన సమాచారంలో కంపెనీ తెలిపింది.

మొత్తం బైకుల అమ్మకాలు 12 శాతం పెరిగి 3,84,993 యూనిట్లకు చేరుకోగా, గత ఏడాది ఇదే నెల నవంబర్‌లో 3,43,446 యూనిట్లు అమ్ముడుపోయాయి. మొత్తం వాణిజ్య వాహనాల అమ్మకాలు 38 శాతం తగ్గి 37,247 యూనిట్లకు చేరుకోగా, గత ఏడాది ఇదే నెలలో 59,777 యూనిట్లు విక్రయించింది.

also read జాన్ అబ్రహం బైక్ కలెక్షన్స్ లో మరో రెండు కొత్త సూపర్ స్పొర్ట్స్ బైక్స్.. ...

నవంబర్‌లో కంపెనీ ఎగుమతులు 14 శాతం పెరిగి 2,23,307 యూనిట్లకు చేరుకున్నాయి. 2019 నవంబర్‌లో కంపెనీ 1,95,448 వాహనాలను మాత్రమే ఎగుమతి చేసింది. దేశంలో లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాత ఆటో రంగంలో వృద్ధి లేదని రాజీవ్ బజాజ్ పేర్కొన్నారు.  

కోవిడ్-19 మహమ్మారి, ఇతర కారణాల వల్ల కంపెనీ, ఇతర వాహనాల తయారీ సంస్థల లాగానే ఈ ఏడాది ప్రారంభంలో అమ్మకాలలో భారీ తిరోగమనాన్ని ఎదుర్కొంది. 2020 నవంబర్‌లో సానుకూల గణాంకాలను పోస్ట్ చేసినప్పటికీ, సేల్స్ పతనం నుండి కంపెనీ ఇంకా పూర్తిగా కోలుకోలేదు.

ఏప్రిల్-నవంబర్ 2020 మధ్య బజాజ్ ఆటో 24,30,718 యూనిట్లను విక్రయించగ 2019 ఇదే కాలంలో 32,87,196 యూనిట్లను విక్రయించింది. దీని అర్థం కంపెనీ మొత్తం అమ్మకాలలో 26% క్షీణతను నమోదు చేస్తోంది.

జీఎస్టీని మార్చాలని, ఆటో రంగానికి ప్రేరణనివ్వాలని, ఎంఎస్‌ఎంఇ రంగాన్ని బలోపేతం చేయాలని రాజీవ్ బజాజ్ పేర్కొన్నారు. లాక్ డౌన్ సమయంలో ఆటో రంగం పెద్ద క్షీణతను చూసింది. లాక్ డౌన్ తరువాత, ప్రజలు ఉద్యోగాలను కోల్పోయారు దీంతో కొనుగోళ్లు మరింత తగ్గాయి అని సంస్థ తెలిపింది.