Asianet News TeluguAsianet News Telugu

కేటీఎం అడ్వెంచర్ బైక్.. కేవలం తక్కువ ఇఎంఐతో మీ సొంతం..

 అడ్వెంచర్ టూరింగ్ బైక్ కెటిఎం 390 అడ్వెంచర్‌ను 6,999 రూపాయల ఇఎంఐ ఫైనాన్సింగ్ ప్లాన్‌ను ప్రకటించింది. ఈ ఏడాది ప్రారంభంలో దేశీయ మార్కెట్లో ప్రారంభించిన కెటిఎం 390 ప్రస్తుత ఎక్స్-షోరూమ్ ఢీల్లీ ధర 3.04 లక్షల రూపాయలు.

Bajaj Auto unveils new financing plan for KTM 390 adventure bike with low emi
Author
Hyderabad, First Published Jul 27, 2020, 5:22 PM IST

బజాజ్ ఆటో సోమవారం బైక్ లవర్స్ కోసం అద్భుతమైన కొత్త ఫైనాన్సింగ్ ప్లాన్‌ను ప్రకటించింది. అడ్వెంచర్ టూరింగ్ బైక్ కెటిఎం 390 అడ్వెంచర్‌ను 6,999 రూపాయల ఇఎంఐ ఫైనాన్సింగ్ ప్లాన్‌ను ప్రకటించింది. ఈ ఏడాది ప్రారంభంలో దేశీయ మార్కెట్లో ప్రారంభించిన కెటిఎం 390 ప్రస్తుత ఎక్స్-షోరూమ్ ఢీల్లీ ధర 3.04 లక్షల రూపాయలు.

దీని ఆన్ రోడ్ ధరపై 80 శాతం ఫైనాన్స్‌ సదుపాయాన్ని అందిస్తుంది. దీనివల్ల కెటిఎం 390 అడ్వెంచర్‌ను అధిక సంఖ్యలో వినియోగదారులకు చేరే  అవకాశం ఉందని బజాజ్ ఆటో లిమిటెడ్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఆస్ట్రేలియన్ ప్రీమియం బైక్ బ్రాండ్‌లో బజాజ్ ఆటోకు 48 శాతం వాటా ఉంది. ఏప్రిల్-జూన్ నెలల్లో కెటిఎం 33,220 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది, అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో 38,267 యూనిట్లు సేల్స్ చేసింది.

also read వాహనదారులకు కొత్త రూల్స్.. బైక్ రిజిస్టర్ అవ్వాలంటే అవి కచ్చితంగా ఉండాల్సిందే! ...

అంతేకాకుండా వినియోగదారులు 95 శాతం వరకు ఫైనాన్స్ కవరేజ్, తక్కువ వడ్డీ రేట్లు, బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్, హెచ్‌డి‌ఎఫ్‌సి బ్యాంక్ నుండి ఇతర ఫైనాన్స్ ఆఫర్లను కూడా పొందవచ్చని కంపెనీ తెలిపింది.


ఇవి కాకుండా కెటిఎం డీలర్‌షిప్‌లు కూడా కెటిఎం 390 అడ్వెంచర్  పై  ఎక్స్ చెంజ్ పథకాలను అందించడానికి సన్నద్ధమవుతున్నాయి. కే‌టి‌ఎం 390 అడ్వెంచర్ మా పోర్ట్‌ఫోలియోకు కీలకమైనది.

ఈ మోడల్ ప్రారంభించినప్పటి నుండి అద్భుతమైన ప్రతిస్పందనను పొందింది. బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ & హెచ్‌డి‌ఎఫ్‌సి బ్యాంక్ వంటి భాగస్వాములతో ఫైనాన్స్ పథకాలు రూపొందించమని, ఇవి చాలా మంది కస్టమర్లను అప్‌గ్రేడ్ అవడానికి ప్రేరేపిస్తాయని" బజాజ్ ఆటో లిమిటెడ్ ప్రెసిడెంట్ (ప్రోబైకింగ్) సుమీత్ నారంగ్ అన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios