అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల.... కేవలం రూ.1100 లకే బుకింగ్

దేశీయ విద్యుత్ వాహనాల తయారీ సంస్థ ‘అవాన్స్ మోటార్స్’ విపణిలోకి ‘ట్రెండ్ -ఈ’ విద్యుత్ బైక్‌ను ఆవిష్కరించింది. రూ.1100 చెల్లించి ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. సింగిల్ బ్యాటరీ బైక్ ధర రూ.56,900, డబుల్ బ్యాటరీ గల బైక్ ధర రూ.81,269గా అవాన్స్ మోటార్స్ నిర్ణయించింది. 

Avan Motors India Launches Trend E Electric Scooter at Rs 56,900

విద్యుత్‌ స్కూటర్ల తయారీ సంస్థ అవాన్‌ మోటార్స్‌ ఇండియా కొత్త మోడల్‌ ‘ట్రెండ్‌ ఈ’ని దేశీయ విపణిలోకి విడుదల చేసింది. సింగిల్‌ బ్యాటరీ ఉన్న మోడల్‌ ధర రూ.56,900 కాగా, రెండు బ్యాటరీలు ఉన్న వెర్షన్‌ రూ.81,269గా కంపెనీ నిర్ణయించింది. 

వినియోగదారులు రూ.1100 ముందస్తుగా చెల్లించి ‘ట్రెండ్ ఈ ’ వెహికల్ కోసం బుకింగ్‌లు చేసుకోవచ్చు. గురువారం నుంచి బుకింగ్‌లు ప్రారంభమయ్యాయని కంపెనీ తెలిపింది. 

లిథియం-ఐయాన్‌ బ్యాటరీ కలిగిన సింగిల్‌ బ్యాటరీ మోడల్‌ గరిష్ఠ వేగం గంటకు 45 కి.మీ. మైలేజీ  60 కి.మీ అందిస్తుంది. ఇక ఒక సారి ఛార్జింగ్‌తో డబుల్‌ బ్యాటరీ మోడల్‌ 110 కి.మీ ప్రయాణిస్తుంది. 

బ్యాటరీని 2-4 గంటల్లో పూర్తిగా ఛార్జింగ్‌ చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. భారత్‌ రహదారులపై ప్రయాణానికి అనుకూలంగా ట్రెండ్‌-ఈ స్కూటర్‌ను రూపొందించామని అవాన్‌ మోటార్స్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్ హెడ్‌ పంకజ్‌ తివారీ పేర్కొన్నారు. 

‘ప్రీ–బుకింగ్స్‌ సమయంలో ఈ స్కూటర్స్‌కు విశేష స్పందన మాకు ఆనందాన్ని ఇచ్చింది. ఈ స్కూటర్‌ ఫీచర్లు కస్టమర్లకు బాగా నచ్చుతాయని భావిస్తున్నాం’ అని అవాన్‌ మోటార్స్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్ హెడ్‌ పంకజ్‌ తివారీ అన్నారు. ట్రెండ్‌ ఈ ఫీచర్లు వినియోగదారులను మెప్పిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. 

హైడ్రాలిక్ టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, కాయిల్ స్ప్రింగ్ రేర్ సస్పెన్షన్ కలిగి ఉంటుంది ట్రెండ్ ఈ బైక్. అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ అండ్ రేర్ వీల్స్‌పై డిస్క్ అండ్ డ్రమ్ బ్రేక్స్ అమర్చారు. న్యూ స్టైలిష్ స్కూటర్ చూడటానికి మస్కూలైన్‌గా ఉంటుంది. యువ తరం ప్రయాణానికి వీలుగా ముచ్చటగా ఉంటుంది. ఈ నెలాఖరులోగా ప్రీ బుకింగ్స్ చేసుకున్న వారికి నెలాఖరులోపే అందుబాటులోకి తెస్తామని అవాన్స్ మోటార్స్ తెలిపింది. 

దేశవ్యాప్తంగా 33 డీలర్ షిప్ లతోకూడిన నెట్ వర్క్ అవాన్స్ మోటార్స్ సంస్థకు ఉంది. రాజస్థాన్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, మణిపూర్, అసోం, సిక్కిం, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, ఒడిశా రాష్ట్రాల్లో డీలర్ షిప్ షాపులు ఉన్నాయి.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios