Ather Energy ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ. 16 వేల వరకూ బంపర్ డిస్కౌంట్, నేడే ఆఫర్ చివరి రోజు, త్వరపడండి..

Ather Energy సంస్థ రూ. 4,000 కార్పొరేట్ తగ్గింపు, రూ. 4,000 ఎక్స్చేంజ్ బోనస్ తో పాటు,  ఇ-స్కూటర్‌ను కొనుగోలు చేయడానికి తీసుకున్న రుణంపై పన్ను ఆదాను అందిస్తోంది. కాగా ఈ ఆఫర్ నేటితో ముగియనుంది. కనుక వెంటనే ఈ ఆఫర్ ద్వారా స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది చివరి అవకాశం అనే చెప్పాలి. 

Ather Energy Electric Scooters  Bumper discount up to 16 thousand, today is the last day of the offer, hurry up MKA

దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ టూ-వీలర్ తయారీదారులలో ఒకటైన Ather Energy, దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి తన కొత్త కార్పొరేట్ ఔట్రీచ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం కింద,  2500 కంటే ఎక్కువ సంస్థలతో భాగస్వామ్యం కలిగి ఉంది. కంపెనీ నెల రోజుల ప్రోగ్రామ్ ఫిబ్రవరి 28, 2023న ముగుస్తుంది. ఏథర్ ఎనర్జీ కార్పొరేట్ ఉద్యోగులకు రూ.16,259 వరకు మొత్తం ప్రయోజనాలను అందిస్తుంది.

ఏథర్ ఎనర్జీ కార్పొరేట్ డిస్కౌంట్
Ather తన ఇ-స్కూటర్‌ను కొనుగోలు చేయడానికి తీసుకున్న రుణంపై రూ. 4,000 కార్పొరేట్ తగ్గింపు, రూ. 4,000 ఎక్స్ఛేంజ్ బోనస్, పన్ను ఆదాను అందిస్తోంది. కంపెనీ స్వయంగా EV వాహనాలపై 3 సంవత్సరాల వారంటీని ఇస్తోంది. అయితే ప్లస్ బెనిఫిట్‌గా కంపెనీ బ్యాటరీపై రూ. 8,259కి 2 సంవత్సరాల వారంటీని ఇస్తోంది. ఈ ఆఫర్‌లు ఫిబ్రవరి 28, 2023 వరకు చెల్లుబాటులో ఉంటాయి.

రిలయన్స్ జియో, విప్రో, శాంసంగ్ ఉద్యోగుల కోసం ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి
Ather Energy, Reliance Jio Infocomm (JIO), Wipro Technologies, Samsung India, Myntra, Tata Technologies, IRCTC, భారతీ ఎయిర్‌టెల్ మొదలైన ప్రముఖ సంస్థల ఉద్యోగులకు కార్పొరేట్ ఆఫర్‌లు  అందుబాటులో ఉన్నాయి.

Ather 450X: ధర, ఫీచర్లు
2023 ఏథర్ 450X ఇటీవల భారతదేశంలో రూ. 1.42 లక్షల ( ఎక్స్-షోరూమ్) ధరకు ఢిల్లీలో విడుదల చేసింది. ఇది 26 Nm గరిష్ట టార్క్‌ను అభివృద్ధి చేసే 6 kW ఎలక్ట్రిక్ మోటార్‌తో జత చేయబడిన 3.7 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను ప్యాక్ తో విడుదల కానుంది. ఈ  ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 146 కిలోమీటర్ల రైడింగ్ రేంజ్‌ను అందిస్తుంది. వాహనం 7.0-అంగుళాల టచ్‌స్క్రీన్ డాష్‌ తో వస్తోంది. ఇందులో చాలా వరకూ మనం ఇన్ఫర్మేషన్ చూసుకునే వీలుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios