ఇండియన్ మార్కెట్లోకి ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160 ప్రీమియం స్కూటర్.. మైలేజ్ ఎంతంటే ?

 ఆటో ఎక్స్‌పో 2020లో ఆవిష్కరించిన అప్రిలియా స్కూటర్‌ను ఇటలీలో ఇండియా కోసం రూపొందించామని, దీనికి  ఇండియన్ మార్కెట్‌లో ప్రత్యేకమైన స్థానం ఉంటుందని, డిజైన్ ఇంకా అధునాతన ఫీచర్స్ కి  కృతజ్ఞతలు తేలుపుతున్నామని పియాజియో తేలిపింది.

Aprilia SXR 160 production in India to start soon in baramati unit

ద్విచక్ర వాహన తయారీ సంస్థ పియాజియో ఇండియా బారామతి తయారీ కేంద్రంలో అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 స్కూటర్‌ ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, స్కూటర్ తయారీని ఎప్పుడు ప్రారంభిస్తుందో లేదా ఏప్రిల్లియా ఎస్ఎక్స్ఆర్ 160ని ఇండియాలో ఎప్పుడు లాంచ్ చేస్తుందో వెల్లడించలేదు.

ఆటో ఎక్స్‌పో 2020లో ఆవిష్కరించిన అప్రిలియా స్కూటర్‌ను ఇటలీలో ఇండియా కోసం రూపొందించామని, దీనికి  ఇండియన్ మార్కెట్‌లో ప్రత్యేకమైన స్థానం ఉంటుందని, డిజైన్ ఇంకా అధునాతన ఫీచర్స్ కి  కృతజ్ఞతలు తేలుపుతున్నామని పియాజియో తేలిపింది.

పియాజియో ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డియెగో గ్రాఫి మాట్లాడుతూ, "మా కస్టమర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న  ప్రత్యేకమైన, ప్రీమియం స్కూటర్‌ను త్వరలో ప్రవేశపెడుతున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. ఆటో ఎక్స్‌పో 2020లో చేప్పినట్లుగా, మేము ఇండియాలో ఉత్పత్తి కోసం సన్నద్ధమవుతున్నాము.

also read ఓలా,ఉబెర్‌ లాంటి సంస్థలపై ప్రభుత్వం కొరడా.. డ్రైవర్లకూ కొత్త రూల్స్‌.. ...

భారతదేశంలో అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 స్కూటర్ పరిశ్రమకు కొత్త అధ్యాయాన్ని తెచ్చిపెట్టింది. దాని అత్యంత వినూత్న రూపకల్పనతో ఎస్ఎక్స్ఆర్ 160 ప్రీమియం స్కూటర్‌ స్టైల్, అధిక సౌకర్యం, పనితీరులో ఉత్తమమైనది. ఈ అనుభవం ప్రతిఒక్కరికీ చాలా దగ్గరగా ఉంటుంది. మేము భారతదేశంలో డీలర్ నెట్‌వర్క్ విస్తరిస్తున్నాము " అని అన్నారు.

రాబోయే మ్యాక్సీ స్కూటర్‌లో '3-కోట్' హెచ్‌డి బాడీ పెయింట్ ఫినిష్, అప్రిలియా సిగ్నేచర్‌ గ్రాఫిక్స్, మాట్ బ్లాక్ డిజైన్‌  ట్రిమ్స్, డార్క్ క్రోమ్ ఎలిమెంట్స్, ఎల్‌ఇడి ట్విన్ క్రిస్టల్ హెడ్ లైట్లు, షార్ప్ బాడీ లైన్స్‌, ఇంటిగ్రేటెడ్ రియర్ బ్లింకర్స్‌తో ఎల్‌ఇడి టైల్లైట్స్ మొదలైన ఫీచర్స్ ఉంటాయి.

అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 కోసం స్పోర్టింగ్ ఎర్గోనామిక్ సీట్లు, హై స్టీరింగ్ హ్యాండిల్ బార్, టచ్ స్విచ్‌లు, మల్టీఫంక్షనల్ ఆల్ డిజిటల్ క్లస్టర్ సౌకర్యవంతమైన ప్రయాణాన్ని ఇస్తాయి. భారతదేశంలో అప్రిలియా స్కూటర్‌తో మొబైల్ కనెక్టివిటీ ఆప్షన్ కూడా కంపెనీ అందించనుంది.

ఇండియాలో తయారైన స్కూటర్ 160 సిసి సింగిల్ సిలిండర్ ఫ్యుయెల్-ఇంజెక్ట్ ఇంజిన్‌తో శక్తినిస్తుంది, 7,600 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 11 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది, 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 12 ఎన్ఎమ్ పీక్ టార్క్ పంపిణీ చేస్తుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios