మార్కెట్లోకి నూతన ఫీచర్లతో హోండా సీబీ బైక్స్
హోండా మోటార్ సైకిల్స్ భారత మార్కెట్లోకి సీబీ యూనికార్న్, సీబీ షైన్, నేవీ కాంబీ మోడల్ మోటారు సైకిళ్లను విడుదల చేసింది.
హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) 150 సీసీ ఇంజిన్ సామర్థ్యం గల ‘సీబీ యూనికార్న్’లో యాంటీ లాక్ బ్రేకింగ్ వ్యవస్థ (ఏబీఎస్) కల కొత్త బైక్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.78,815గా నిర్ణయించారు.
ప్రజాదరణ పొందిన ప్రముఖ మోడళ్లు సీబీ షైన్ (డ్రమ్ వేరియంట్), సీడీ డ్రీమ్ డీఎక్స్, నవీల్లో కాంబీ బ్రేక్ వ్యవస్థ (సీబీఎస్) వేరియంట్‌లను సైతం కంపెనీ విపణిలోకి ప్రవేశపెట్టింది.
2019 సీబీ షైన్ సీబీఎస్ ధర రూ.58,338, సీడీ 110 డ్రీమ్ సీబీఎస్ మోడల్ బైక్ ధర రూ.50,028 కాగా, ఇటీవల ఆవిష్కరించిన నవీ సీబీఎస్ వేరియంట్ బైక్ ధర రూ.47,100 గా నిర్ణయించినట్లు హెచ్‌ఎంఎస్‌ఐ తెలిపింది. వీటితో ఈ ఏడాదిలో బైకుల అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని కంపెనీ భావిస్తోంది.