Asianet News TeluguAsianet News Telugu

కోచింగ్ సెంటర్ లో దక్కని అనుమతి.. పారుపల్లి కశ్యప్ అసంతృప్తి

సాయి ప్రణీత్, శ్రీకాంత్ ల తర్వాత అత్యుత్తమ ర్యాంకు తనదేనని అన్నారు. అయినా తనను ట్రైనింగ్ సెంటర్ లోకి అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.  జాబితా తయారు చేసిన సాయ్ అధికారులతో మాట్లాడాలని గోపీచంద్ తనకు సలహా ఇచ్చాడని కశ్యప్ పేర్కొన్నాడు.

Why am I not in national camp for Olympics, asks Parupalli Kashyap
Author
Hyderabad, First Published Aug 26, 2020, 7:30 AM IST

జాతీయ బ్యాడ్మింటన్ కోచింగ్ సెంటర్ లో తనకు చోటు కల్పించకపోవడంపై పారుపల్లి కశ్యప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించే అవకాశాలు తనకు చాలా ఉన్నాయని కశ్యప్ అభిప్రాయపడ్డాడు.

హైదరాబాద్ లోని సాయ్ గోపిచంద్ అకాడమీలో 8మందినే శిక్షణకు అనుమతించడం అశాస్త్రీయంగా అనిపిస్తోందని కశ్యప్ పేర్కొన్నాడు. ఈ 8 మంది ఒలంపిక్ ఆశావహులు ఎలా అయ్యారని ప్రశ్నించారు. వీరిలో ముగ్గురికి మాత్రమే ఒలంపిక్ బెర్తులు దాదాపు ఖరారయ్యాయని అన్నారు. శ్రీకాంత్, మహిళల డబుల్స్ జోడీతో సహా మిగితా వారందరికీ ఒలింపిక్స్ అవకాశం కష్టంగా ఉందన్నారు. ప్రపంచ ర్యాంకింగ్స్ లో తనది 23వ స్థానమని చెప్పారు.

సాయి ప్రణీత్, శ్రీకాంత్ ల తర్వాత అత్యుత్తమ ర్యాంకు తనదేనని అన్నారు. అయినా తనను ట్రైనింగ్ సెంటర్ లోకి అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.  జాబితా తయారు చేసిన సాయ్ అధికారులతో మాట్లాడాలని గోపీచంద్ తనకు సలహా ఇచ్చాడని కశ్యప్ పేర్కొన్నాడు.

ఆ జాబితా రూపకల్పనకు అనుసరించే విధివిధానాలేంటని తాను సాయ్ డీజీని అడిగానని.. ఆ తర్వాతి రోజు తనకు సాయ్ సహాయక డైరెక్టర్ నుంచి ఫోన్ వచ్చిందని చెప్పారు. సాయ్ తో, భారత బ్యాడ్మింటన్ సంఘంతో ఉన్నతాధికారులు మాట్లాడారని.. ఈ 8మందికి మాత్రమే ఒలింపిక్స్ అర్హత సాధించే అవకాశం ఉందని వారు చెప్పారన్నారు. తనకు ఆయన మాటలు వింతగా అనిపించినట్లు కశ్యప్ తెలిపాడు.

భద్రత దృష్ట్యా  ఒలింపిక్స్ వరకు 8మందే ప్రాక్టీస్ చేస్తారని చెప్పారని కశ్యప్ పేర్కొన్నాడు. అధికారులు ఇచ్చిన వివరణ తనకు అర్థం కాలేదని చెప్పాడు. తనలాగే అర్హత సాధించేందుకు తక్కువ అవకాశం ఉన్న లక్ష్య సేన్ బెంగళూరులో అందరితో కలిసి సాధన చేస్తున్నాడని కశ్యప్ చెప్పారు. మిగితావారితో ప్రాక్టీస్ చేసే అవకాశమే లేకపోతే..తాను ఒలంపిక్స్ ఎలా సాధిస్తానంటూ ప్రశ్నించారు.

Follow Us:
Download App:
  • android
  • ios