థాయ్‌లాండ్ ఓపెన్ కోసం బ్యాంకాక్ చేరిన భారత బ్యాడ్మింటన్ ప్లేయర్లు సైనా నెహ్వాల్, ప్రణయ్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ముందు జాగ్రత్తగా ప్లేయర్లకు మూడు సార్లు కరోనా పరీక్షలు నిర్వహించారు థాయ్‌లాండ్ ఓపెన్ నిర్వహించారు. మొదటి రెండుసార్లు సైనాకి నెగిటివ్ రాగా మూడోసారి పాజిటివ్ వచ్చింది.

తన రిపోర్టు ఇంకా చేతికి రాలేదని, మ్యాచ్ ఆరంభానికి ముందు వామప్ చేస్తుంటే కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పి, తనను ఆసుపత్రి తీసుకెళ్లారని చెప్పింది సైనా నెహ్వాల్. తాజాగా భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ కిడింబి శ్రీకాంత్ కూడా సంచలన పోస్టు షేర్ చేశారు.

‘మ్యాచ్‌కి ముందు చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ నాకు ఇలా రక్తస్రావమైంది. నేను ఇప్పటికే నాలుగు సార్లు పరీక్షలు చేయించుకున్నాను. దేనిలోనూ పాజిటివ్ రాలేదు...’ అంటూ రక్తం కారుతున్న ఫోటోను షేర్ చేశాడు శ్రీకాంత్.

గుంటూరులో జన్మించిన శ్రీకాంత్... కామన్వెల్‌తో మిక్స్‌డ్ టీమ్ తరుపున గోల్డ్, మెన్స్ సింగిల్స్‌లో సిల్వర్ పతకాన్ని సాధించాడు. పద్మశ్రీ, అర్జున అవార్డులు కూడా అందుకున్నాడు.అనేక అద్భుత విజయాలతో మెన్స్ సింగిల్స్‌లో టాప్ ర్యాంకు సాధించి రికార్డు క్రియేట్ చేశాడు శ్రీకాంత్.