Asianet News TeluguAsianet News Telugu

సాత్విక్ సాయిరాజ్ - చిరాగ్ శెట్టి ద్వయం సంచలనం.. ఫ్రెంచ్ ఓపెన్ డబుల్స్ టైటిల్ సొంతం

French Open Men's Doubles Title: ఆంధ్రప్రదేశ్ కుర్రాడు సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి - చిరాగ్ శెట్టి ల ద్వయం సంచలనం సృష్టించింది.  ఈ ద్వయం పారిస్ వేదికగా జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ డబుల్స్ టైటిల్ ను సొంతం చేసుకుంది. 

Satwik sairaj-Chirag Shetty pair Won French Open men's Super 750 Doubles Title
Author
First Published Oct 31, 2022, 1:14 PM IST | Last Updated Oct 31, 2022, 1:14 PM IST

పారిస్ వేదికగా జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ సూపర్-750 టోర్నీలో భారత స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి - చిరాగ్ శెట్టిలు అద్భుతం  చేశారు. ఈ మెగా టోర్నీలో ఆదివారం జరిగిన  డబుల్స్ ఫైనల్స్ లో ఎనిమిదో సీడ్ సాత్విక్ - చిరాగ్ ద్వయం..  చైనీస్ తైఫీకి చెందిన 25వ సీడ్  లూ చింగ్ యో - యంగ్ పొ హన్ ను ఓడించి టైటిల్ ను సొంతం చేసుకున్నారు. ఆదివారం నాటి ఫైనల్లో   సాత్విక్ - చిరాగ్ ల జంట 21-13, 21-19 తేడాతో చైనీస్ తైఫీ జోడీని చిత్తుగా ఓడించింది.  

49 నిమిషాల పాటు జరిగిన  ఫైనల్ లో సాత్విక్ - చిరాగ్ ల జోడీ.. తొలి సెట్ నుంచే  దూకుడుగా ఆడారు.  తొలి సెట్ లో 11-6 లీడ్ సాధించిన  ఈ ద్వయం.. సెట్ ముగిసేసరికి 21-13తో ఆధిక్యం సాధించింది. అయితే రెండో సెట్ లో చైనీస్ తైఫీ జోడీ పుంజుకుంది.  

ఒక దశంలో సాత్విక్ జోడీ.. 7-4తో నిలిచినా.. లూ చింగ్  ద్వయం సెట్ చివరికి వెళ్లేసరికి 19-17 ఆధిక్యంలోకి దూసుకొచ్చింది.  కానీ ఒత్తిడిని తట్టుకుంటూ ఆఖర్లో వరుసగా  నాలుగు పాయింట్లు సాధించడంతో సాత్విక్ జోడీ రెండో సెట్ ను 21-19తో నెగ్గింది. ఆ సెట్ తో పాటు మ్యాచ్ ను కూడా సొంతం చేసుకుని టైటిల్ విజేతగా నిలిచింది. 

 

ఇక గతకొంతకాలంగా  వరుస టోర్నీలలో మెరుస్తున్న ఈ జోడీ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కూడా సొంతం చేసుకోవడం గమనార్హం. 2019 థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 500 తో పాటు ఈ ఏడాది ఇండియా ఓపెన్ సూపర్ 500 గెలుచుకున్నారు. అంతేగాక కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణం, థామస్ కప్  లో చారిత్రాత్మక విజయం తో పాటు వరల్డ్ ఛాంపియన్షిప్స్ లో కాంస్యం నెగ్గి  జోరు మీదున్నారు. 

భారత్ చివరిసారిగా ఈ (ఫ్రెంచ్ ఓపెన్) టోర్నీలో 1983లో  మెన్స్ డబుల్స్ టైటిల్స్ గెలుచుకుంది.   పార్థో గంగూలీ - విక్రమ్ సింగ్ లు.. 1983లో ఈ టైటిల్ ను గెలిచారు. ఆ తర్వాత 39 ఏండ్లకు ఈ ఘనత సాధించింది సాత్విక్ - చిరాగ్ ల ద్వయమే కావడం గమనార్హం.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios