బ్మాడ్మింటన్ క్రీడాకారిణి, తన భార్య సైనా నెహ్వాల్ పై బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్.. ప్రేమ వర్షం కురిపించారు. గతేడాది సైనా, కశ్యప్ లు ప్రేమ వివాహం చేసుకున్నారు. కాగా.... వారి వివాహం జరిగి నేటికి సరిగ్గా సంవత్సరం అవుతోంది. ఈ సందర్భంగా కశ్యప్... తన భార్యపై ఉన్న ప్రేమను తెలియజేశాడు. మొదటి పెళ్లి రోజు సందర్భంగా.... ఈ ఏడాది ఎంత ఆనందంగా గడిచిందో వివరించాడు.

‘ఈ ప్రపంచంలో ఉన్న అత్యంత అద్భుతమైన మహిళవు నువ్వు. మంచి భార్య రావాలని నేను ఏనాడు కోరుకోలేదు. మనం ఒక్కటై గడిచిన.. ఈ ఏడాదిని అద్భుతంగా మలిచినందుకు నీకు ధన్యవాదాలు. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. పెళ్లిరోజు శుభాకాంక్షలు’ అంటూ కశ్యప్... తన సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

అంతేకాకుండా... వారిద్దరూ కలిసి దిగిన కొన్ని అందమైన ఫోటోలను సైతం షేర్ చేశాడు. కాగా... ఈ దంపతులకు అభిమానులు, నెటిజన్లు సైతం మొదటి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సైనా సైతం తమ మొదటి పెళ్లిరోజును పురస్కరించుకుని... భర్తతో కలిసి కేక్‌ కట్‌ చేస్తున్న ఫొటోలను షేర్‌ చేశారు.

ఇదిలా ఉండగా... సైనా, కశ్యప్ లు దాదాపు పది సంవత్సరాలపాటు ప్రేమించుకున్నారు. కానీ ఏరోజు తమ ప్రేమ విషయం ఎక్కడా బయటపడకుండా జాగ్రత్త పడ్డారు. చివరకు గతేడాది ఇరు కుటుంబాల సమక్షంలో చాలా నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత సినీ, రాజకీయ ప్రముఖులకు గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు.