ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతక విజేత, భారత స్టార్ షట్లర్ భమిడిపాటి సాయిప్రణీత్‌ త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు. శుక్రవారం హైదరాబాద్‌లో శ్వేత జయంతితో సాయిప్రణీత్‌ నిశ్చితార్థం జరిగింది. సాయి ప్రణీత్‌ది పెద్దలు కుదిర్చిన వివాహం కావడం విశేషం.

శ్వేత జయంతిది కాకినాడ. డిసెంబరు 8న కాకినాడలో పెళ్లి జరుగనున్నట్లు సాయిప్రణీత్‌ తెలిపాడు. డిసెంబరు 9న హైదరాబాద్‌లో ప్రముఖుల కోసం విందు నిర్వహించనున్నారు. ఈ నిశ్చితార్థంతో సాయి ప్రణీత్ కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నాడు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

New chapter begins 😁 got engaged 💍 @swethajayanthi 💖

A post shared by Sai Praneeth (@saipraneeth92) on Nov 22, 2019 at 7:19am PST

 

ఈ వేడుకకు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్‌, అశ్విని పొన్నప్పతో సహా పలువురు బ్యాడ్మింటన్ క్రీడాకారులు  హాజరయ్యారు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో అర్హత సాధించే క్రమంలో సాయి ప్రణీత్ గత వారం బీడబ్లుఎఫ్ ర్యాంకింగ్స్‌లో 10వ స్థానానికి చేరుకున్నాడు.

కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ఏడాది అర్జున అవార్డు కూడా అందుకున్నాడు. సాయి ప్రణీత్‌కు ఈ ఏడాది అద్భుతంగా సాగింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెలిచి 36 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు. అంతేకాదు 1983లో ప్రకాశ్ పదుకొణె తర్వాత వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ నెగ్గిన భారత రెండో పురుష షట్లర్‌గా ప్రణీత్ నిలిచాడు.