Singapore Open 2022: క్వార్టర్స్ లో హాన్ యూ ను చిత్తు చేసి సెమీస్ కు దూసుకెళ్లిన సింధు

PV Sindhu: సింగపూర్  వేదికగా జరుగుతున్న సింగపూర్ ఓపెన్  సూపర్ 500 టోర్నమెంట్  లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సెమీస్ కు దూసుకెళ్లింది. 

PV Sindhu Beats Han Yue in quarters and Enters In Semi finals in the  Singapore Open Super 500 Tournament

డబుల్ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్, భారత బ్యాడ్మింటన్ సంచలనం పీవీ సింధు సింగపూర్ ఓపెన్ సూపర్  500 టోర్నమెంట్ లో సెమీస్ కు దూసుకెళ్లింది. ప్రపంచ ఏడో ర్యాంకర్ అయిన  ఆమె..  క్వార్టర్స్ లో చైనాకు చెందిన బలమైన ప్రత్యర్థి  హాన్ యూ ను ఓడించి  సెమీస్ బెర్త్ ను కన్ఫర్మ్ చేసుకుంది. మహిళల సింగిల్స్ లో భాగంగా శుక్రవారం గంటపాటు సాగిన పోరులో సింధు.. 17-21, 21-11, 21-19  తో హ్యాన్ యూ ను మట్టికరిపించింది. 

క్వార్టర్స్ లో తొలి సెట్ కోల్పయినా సింధు.. తర్వాత మాత్రం బెబ్బులిలా గర్జించింది.  తర్వాత పట్టుదలగా ఆడి రెండు, మూడో సెట్ ను కైవసం చేసుకుంది.  తద్వారా ఆమె సెమీస్ కు దూసుకెళ్లింది.  ఈ ఏడాది మే లో నిర్వహించిన థాయ్లాండ్ ఓపెన్ తర్వాత ఆమె సెమీస్ కు  వెళ్లడం ఇదే ప్రథమం. మధ్యలో పలు టోర్నీలలో పాల్గొన్నా సింధు క్వార్టర్స్ లోనే  ఇంటిబాట పట్టేది. 

ఇక సెమీస్ లో సైనా.. 38 వ ర్యాంకర్  అయిన జపాన్ క్రీడాకారిణి సయీనా కవాక్స్మి ని ఢీకొంటుంది.  కవాక్స్మి  క్వార్టర్స్ లో 21-17, 21-19 తేడాతో థాయ్లాండ్ కు చెందిన  ఆరో సీడ్ క్రీడాకారిణి  చూచ్వోంగ్ ను ఓడించింది. 

 

ఈనెల 28 నుంచి బర్మింగ్హోమ్ వేదికగా జరుగబోయే కామన్వెల్త్ క్రీడలకు సన్నద్ధమవుతున్న సింధు..  సెమీస్ తో పాటు ఫైనల్ లోనూ నెగ్గాలని భావిస్తున్నది. ఒలింపిక్స్ లో కాంస్యం తర్వాత స్థాయికి తగ్గ  ప్రదర్శన చేయడంలో విఫలమవుతున్న సింధు..  సింగపూర్ ఓపెన్ లో గెలిచి ఆత్మవిశ్వాసంతో కామన్వెల్త్ గేమ్స్ లో బరిలోకి దిగాలని ఆశిస్తున్నది.

అంతకుముందు రెండో రౌండ్ లో సింధు..  బెల్జియానికి చెందిన 59వ ర్యాంకర్ తుయ్ లిన్ గుయెన్‌తో జరిగిన మ్యాచ్‌లో 2-1 తేడాతో విజయాన్ని అందుకుంది.  19-21 తేడాతో మొదటి సెట్ కోల్పోయిన పీవీ సింధు, ఆ తర్వాత అదిరిపోయే రేంజ్‌లో కమ్‌బ్యాక్ ఇచ్చింది. 21-19 తేడాతో రెండో సెట్ గెలిచి, 21-18 తేడాతో మూడో సెట్‌ని సొంతం చేసుకుని క్వార్టర్స్ కు అర్హత సాధించిన విషయం విధితమే. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios