ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తాజ్వాలకి ఎంగేజ్మెంట్ అయిపోయిందా..? సోషల్ మీడియాలో అవుననే ప్రచారమే జరుగుతోంది. గుత్తాజ్వాల..  తన ప్రియుడు విష్ణు విశాల్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ మేరకు ఇప్పుడు వీరి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

వారిద్దరి చేతికి ఉంగరాలు కనపడుతున్నాయి. ఇటీవల గుత్తాజ్వాల పుట్టిన రోజు కాగా.. ఆ వేడుకల్లో పాల్గొనేందుకు విష్ణు హైదరాబాద్ వచ్చారు. బర్త్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా విష్ణు విశాల్.. గుత్తా జ్వాలకు మరో సర్ ఫ్రైజ్ ఇచ్చారట. ఆ వేడుకల్లోనే ఆమె చేతికి ఉంగరం తొడిగి ఎంగేజ్మెంట్ అయిపోయిందనిపించారు. దానికి సంబంధించిన ఫోటోలను వీరి అభిమానులు విపరీతంగా షేర్ చేస్తున్నారు.

 

ఇదిలా ఉండగా.. కరోనా లాక్ డౌన్ సమయంలో విశాల్ కి దూరంగా ఉండలేక గుత్తాజ్వాలా చాలా ఇబ్బంది పడింది. ఈ విష‌యాన్ని జ్వాలానే స్వ‌యంగా ట్విట‌ర్ ద్వారా తెలిపారు. లాక్‌డౌన్‌ కారణంగా గుత్తా జ్వాలా హైద‌రాబాద్‌లోనే ఉంటున్నారు. తన ప్రియుడు విష్ణు విశాల్‌ను మిస్ అవుతున్న‌ట్లు తెలిపారు. ఈ మేరకు మిస్ యూ..అంటూ ట్వీట్ చేశారు. అయితే దీనిపై స్పందించిన‌ విష్ణు ప‌ర్లేదు.. ప్ర‌స్తుతం సామాజిక దూరం ముఖ్యం.. అంటూ జ్వాలాను కూల్ చేశారు.

కాగా బ్యాడ్మింటన్‌ ఫైర్‌ బ్రాండ్‌  గుత్తా జ్వాల, త‌మిళ న‌టుడు విష్ణు విశాల్‌ రిలేష‌న్‌షిప్‌లో ఉన్న విష‌యం తెలిసిందే. గ‌తంలో వీరిద్ద‌రికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైర‌ల్ అవ్వ‌గా అందులో  విష్ణు.. గుత్తా జ్వాల‌కు ముద్దు పెడుతున్న ఫోటో కూడా ఇందులో ఉండ‌టం విశేషం. 

దీంతో వీరిద్ద‌రూ ప్రేమాయ‌ణం న‌డుపుత‌న్న‌ట్లు క్లారిటీ ఏర్ప‌డింది. ఇక‌ హీరో విష్ణు విశాల్ గతేడాది జూన్‌లో తన భార్య రజనీతో విడిపోయిన విషయం తెలిసిందే. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. మరోవైపు గుత్తా జ్వాల కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న మరో బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు చేతన్‌ ఆనంద్‌తో విభేదాల కారణంగా విడిపోయారు. తాజాగా.. వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకోగా.. త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది.