Asianet News TeluguAsianet News Telugu

హీరో విష్ణు విశాల్ తో.. గుత్తా జ్వాలా పెళ్లి ముహూర్తం ఫిక్స్

వీరి పెళ్లి శుభ లేక కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత కొంత కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట.. ఇప్పుడు పెళ్లి ద్వారా ఒకటి కానున్నారు.
 

Jwala Gutta and Actor Vishnu Vishal Set to Get Married on April 22
Author
Hyderabad, First Published Apr 13, 2021, 2:05 PM IST

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అయ్యారు. ఇటీవల ఆమె తన ప్రియుడు విష్ణు విశాల్ తో ఎంగేజ్మెంట్ చేసుకోగా... ఇప్పుడు పెళ్లి ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు. ఈ నెల 22వ తేదీన విష్ణు విశాల్ ని ఆమె వివాహం చేసుకోనున్నారు.

వీరి పెళ్లి శుభ లేక కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత కొంత కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట.. ఇప్పుడు పెళ్లి ద్వారా ఒకటి కానున్నారు.

Jwala Gutta and Actor Vishnu Vishal Set to Get Married on April 22

ఇదిలా ఉండగా.. కరోనా లాక్ డౌన్ సమయంలో విశాల్ కి దూరంగా ఉండలేక గుత్తాజ్వాలా చాలా ఇబ్బంది పడింది. ఈ విష‌యాన్ని జ్వాలానే స్వ‌యంగా ట్విట‌ర్ ద్వారా తెలిపారు. లాక్‌డౌన్‌ కారణంగా గుత్తా జ్వాలా హైద‌రాబాద్‌లోనే ఉంటున్నారు. తన ప్రియుడు విష్ణు విశాల్‌ను మిస్ అవుతున్న‌ట్లు తెలిపారు. ఈ మేరకు మిస్ యూ..అంటూ ట్వీట్ చేశారు. అయితే దీనిపై స్పందించిన‌ విష్ణు ప‌ర్లేదు.. ప్ర‌స్తుతం సామాజిక దూరం ముఖ్యం.. అంటూ జ్వాలాను కూల్ చేశారు.

కాగా బ్యాడ్మింటన్‌ ఫైర్‌ బ్రాండ్‌  గుత్తా జ్వాల, త‌మిళ న‌టుడు విష్ణు విశాల్‌ రిలేష‌న్‌షిప్‌లో ఉన్న విష‌యం తెలిసిందే. గ‌తంలో వీరిద్ద‌రికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైర‌ల్ అవ్వ‌గా అందులో  విష్ణు.. గుత్తా జ్వాల‌కు ముద్దు పెడుతున్న ఫోటో కూడా ఇందులో ఉండ‌టం విశేషం. 

దీంతో వీరిద్ద‌రూ ప్రేమాయ‌ణం న‌డుపుత‌న్న‌ట్లు క్లారిటీ ఏర్ప‌డింది. ఇక‌ హీరో విష్ణు విశాల్ రెండేళ్ల క్రితం  తన భార్య రజనీతో విడిపోయిన విషయం తెలిసిందే. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. మరోవైపు గుత్తా జ్వాల కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న మరో బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు చేతన్‌ ఆనంద్‌తో విభేదాల కారణంగా విడిపోయారు. తాజాగా.. వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకోగా.. త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios