ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తాజ్వాల తమిళ హీరో విష్ణు విశాల్ తో డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. న్యూ ఇయర్ సందర్భంగా ఆమె ఫోటోల ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలపై తాజాగా గుత్తా జ్వాల స్పందించారు.

‘అది నా పర్సనల్‌. వివాదం చేయొద్దు’అని సమాధానం దాటవేసింది. ఇక, గుత్తా జ్వాల రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్‌ అకాడమీ అధికారిక వెబ్‌సైట్‌ను ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ గురువారం ఓ హోటల్‌లో ప్రారంభించారు. 

AlsoRead హీరోని పబ్లిక్ గా కిస్ చేస్తూ... గుత్తాజ్వాల.. నెట్టింట ఫోటోలు వైరల్...

అనంతరం జ్వాల మీడియాతో మాట్లాడుతూ దేశానికి చాంపియన్‌లను అందించాలనే లక్ష్యంతో అకాడమీ స్థాపించానని తెలిపారు. ‘మొయినాబాద్‌లో సువిశాలమైన అకాడమీని నెలకొల్పాం. ఆధునిక, అత్యున్నత ప్రమాణాలతో కూడిన 14 బ్యాడ్మింటన్‌ కోర్టులను అందులో ఏర్పాటు చేశామన్నారు. నిష్ణాతులైన విదేశీ కోచ్‌లు, ఫిజియోథెరపిస్టుల సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు.

కాగా...  నూతన సంవత్సర వేడుకలను ఆమె తమిళ హీరో విష్ణు విశాల్ తో కలిసి జరుపుకున్నారు. కాగా.... వీటికి సంబంధించిన ఫోటోలను ఆమె తన ట్విట్టర్ లో షేర్ చేశారు. అయితే... ఈ ఫోటోల్లో వారు ఒకరినొకరు ముద్దులు పెట్టుకుంటూ ఉండటం గమనార్హం. గతంలోనూ వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలను గుత్తా జ్వాల అభిమానులతో పంచుకున్నారు. అయితే... ఇలా పబ్లిక్ గా ముద్దులు పెట్టుకుంటూ కనిపించడం ఇదే తొలిసారి. న్యూ ఇయర్ విషెస్ తెలియజేస్తూ ఆమె ఈ ఫోటోలను పంచుకున్నారు.

ఇక వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని గుసగుసలు పెట్టిన నెటిజన్లు.. తాజా ఫోటోలతో పక్కా కన్ఫర్మ్‌ అయ్యారు. ప్రస్తుతం ఈ ఫోటోలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.విష్ణు విశాల్‌ తన భార్య రజనీతో విడిపోవడానికి గుత్తా జ్వాలనే కారణమని ఓ నెటిజన్‌ విమర్శించాడు. అయితే ఈ జంట ఎంతో క్యూట్‌ అండ్‌ హాట్‌గా ఉందంటూ మరికొంతమంది కామెంట్‌ చేస్తున్నారు. వేరువేరుగా విడిపోయి ఒకటి అవుతున్న జంట అంటూ మరో నెటిజన్‌ సరదాగా పేర్కొన్నాడు.

ఇక హీరో విష్ణు విశాల్‌ గత జూన్‌లో తన భార్య రజనీతో విడిపోయిన విషయం తెలిసిందే. మరోవైపు గుత్తా జ్వాల కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న మరో బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు చేతన్‌ ఆనంద్‌తో పలు విభేదాల కారణంగా విడిపోయారు. అయితే వీరిద్దరూ విడిపోవడానికి టీమిండియాకు చెందిన ఓ మాజీ క్రికెటర్‌ కూడా ఒక కారణమంటూ రూమర్స్‌ వచ్చాయి. అయితే ఈ వార్తలను గుత్తా జ్వాలా గతంలోనే కొట్టి పారేశారు.