నెటిజన్ అనుచిత వ్యాఖ్య: విషాదంలో నేనుంటే అంటూ గుత్తా జ్వాల ఫైర్
తన సోషల్ మీడియా పోస్టుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నెటిజన్ మీద బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. మన సమాజం ఎటు పోతోందని ఆమె ప్రశ్నించారు.
హైదరాబాద్: ఓ నెజిజన్ మీద బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల తీవ్రంగా మండిపడ్డారు చైనాలో ఉంటున్న ఆమె అమ్మమ్మ ఇటీవల మరణించింది. దీంతో ఆమెకు నివాళులు అర్పిస్తున్ ఫోటోలను శుక్రవారం సోషల్ మీడియాలో షేర్ చేసి విచారం వ్యక్తం చేసింది. దీనిపై ఓ నెటిజన్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు.
ఆ స్క్రీన్ షాట్ ను అభిమానులతో పంచుకుంటూ మనం ఎటు పోతున్నామని ప్రశ్నించింది. ఇంతకు ముందు తమ అమ్మ ఆమెను చూడడానికి తరుచుగా వెళ్తుండేదని, కానీ కరోనా వైరస్ కారణంగా నిరుడు వెళ్లడానికి వీలు కాలేదని, మన ప్రియమైనవాళ్ల కోసం వీలున్నప్పుడే ఏది చేయాలనిపిస్తే అది చేయాలనే ముఖ్యమంత్రి విషయాన్ని వైరస్ మనకు గుర్తు చేసిందని ఆమె అన్నారు.
దానిపై ఓ నెటిజన్ స్పందిస్తూ కోవిడా లేకుంటే చైనీస్ వైరసా అని వ్యాఖ్యానించాడు. దీంతో గుత్తా జ్వాల అతనిపై తీవ్రమైన ఆగ్రహం వ్క్తం చేస్తూ ట్వీట్ చేసింది.
మా అమ్మమ్మ చనిపోయిన బాధలో తాను ఉంటే ఆశ్చర్యంగా ఇలాంటి వ్యాఖ్యలు వస్తున్నాయని, తాను కోవిడ్ అని ఎందుకు పేర్కొన్నాను, చైనీస్ వైరస్ అని ఎందుకు చెప్పలేదని అడుగుతున్నారని, మన సమాజానికి ఏమైందని, సానుభూతి ఎక్కడుందని, మనం ఎటు వైపు సాగుతున్నామని, అలాంటి వాళ్లను వెనకేసుకు రావడం సిగ్గు చేటు అని ఆమె అన్నారు.