విశ్వవిజేత, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధూకి మరోసారి పరాభవం ఎదురైంది. చైనా ఓపెన్ లోనూ ఆమె తన సత్తా చాటలేకపోయింది. తొలి రౌండ్ లోనే ఇంటి ముఖం పట్టింది. చైనా ఓపెన్‌లో తొలి రౌండ్‌లోనే ఓటమి పాలైంది. ప్రపంచ 42వ ర్యాంకు క్రీడాకారిణి పాయ్ యు పో(చైనీస్ తైపీ) చేతిలో సింధు ఓడిపోయింది. 74 నిమిషాలపాటు సాగిన పోరులో 13-21, 21-18, 19-21 తేడాతో మ్యాచ్‌ను చేజార్చుకుంది. గత డెన్మార్క్, కొరియా ఓపెన్‌లోనూ తొలి రౌండ్‌లోనే సింధు ఇంటి ముఖం పట్టింది.

మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధుకి అనామక క్రీడాకారిణి షాకిచ్చింది. ఈ మ్యాచ్ లో ఆరో సీడ్ సింధు 13-21, 21-18, 19-21 తో 42 ర్యాంకర్ పాయ్ యు చేతిలో పరాజయం చవిచూసింది. పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజు-చిరాగ్ శెట్టి 21-9,21-15 తో ఫిలిప్ ర్యాన్( అమెరికా)ను చిత్తుచేసి ప్రీక్వార్టర్స్ లో అడుగుపెట్టారు.

మిక్స్ డ్ డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజు- అశ్విని పొన్నప్ప 21-19, 21-19తో జాషువా-జోసెఫైన్(కెనడా) పై నెగ్గారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కిరెడ్డి- అశ్విని 9-21,8-21 తో వెన్-జెంగ్(చైనా) చేతిలో కంగుతిన్నారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రణయ్ 17-21,  18-21 తో రస్ ముస్ గెమ్కీ( డెన్మార్క్) చేతిలో ఓడాడు.

దాదాపుు 74 నిమిషాలపాటు సాగిన ఈ పోరులో సింధు తన చేతులారా మ్యాచ్ కోల్పోయింది. తొలి గేమ్ లో పాయ్ జోరు చూపించింది. 8-4 తో ఆధిక్యం సంపాదించిన పాయ్ 20-8 తో మరింత ముందంజ వేసింది. చివరికి 21-13తో తొలి గేమ్ గెలుచుకుంది. రెండో గేమ్ లో సింధు ఆధిపత్యం కనపరిచింది.  ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థిపై పైచేయి సాధించింది.

11-8తో ఆధిక్యం సంపాదించిన సింధు 17-11తో రెండే గేమ్ కి చేరువైంది. ప్రత్యర్థి పుంజుకున్న పట్టుదలగా ఆడిన సింధు 21-18తో గేమ్ ను గెలిచింది. నిర్ణయాత్మక మూడో గేమ్ లో సింధు మరోసారి తడపడింది. ఆధిక్యంలో ఉండి కూడా మ్యాచ్ ని తన చేతులారా చేజార్చుకుంది. సింధు తడపాటును పాయ్ తనకు అనుకూలంగా మార్చుకుంది. దీంతో విజయం ఆమె సొంతమైంది.