రేపిస్టులను ఆపుతుందా? గుత్తా జ్వాల ప్రశ్న, సైనా రెస్పాన్స్
పోలీసులు నిందితులను ఎన్ కౌంటర్ చేయడం పై సర్వత్రార హర్షం వ్యక్తమౌతోంది. తాజాగా... క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, గుత్తా జ్వాలలు కూడా ఈ ఘటనలపై స్పందించారు.
శంషాబాద్ లో వెటర్నరీ డాక్టర్ దిశను నలుగురు కామాంధులు... అతి కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఆ నలుగురు నిందితులు ఆరిఫ్, చెన్నకేశవులు, శివ, నవీన్ లను శుక్రవారం ఉదయం పోలీసులు దర్యాప్తులో భాగంగా సీన్ రీ కన్ స్ట్రక్షన్ కోసం దిశను చంపిన స్థలానికి తీసుకువెళ్లారు.
కాగా... అక్కడ నిందితులు పోలీసుల నుంచి పారిపోవడానికి ప్రయత్నించడంతో... ఎన్ కౌంటర్ చేశారు. కాగా... పోలీసులు నిందితులను ఎన్ కౌంటర్ చేయడం పై సర్వత్రార హర్షం వ్యక్తమౌతోంది. తాజాగా... క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, గుత్తా జ్వాలలు కూడా ఈ ఘటనలపై స్పందించారు.
భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ తన ట్విట్టర్‌లో "గ్రేట్ వర్క్ హైదరాబాద్ పోలీసు. వుయ్ సల్యూట్ యు" అంటూ కామెంట్ పెట్టారు.
కేంద్ర మాజీ మంత్రి, ఏథెన్స్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత రాజ్యవర్థన్‌సింగ్ రాథోడ్ కూడా హైదరాబాద్ పోలీసులపై ప్రశంసల వర్షం కురిపించారు.తన ట్విట్టర్‌లో "హైదరాబాద్ పోలీసులకు ఇవే నా అభినందనలు. పోలీస్ పవర్‌ను, నాయకత్వాన్ని చూపెట్టారు. చెడుపై మంచి సాధించిన విజయం అని దేశ ప్రజలు తెలుసుకోవాలి" అంటూ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ట్వీట్ చేశారు.
మరో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా తన ట్వీటర్ "ఇది భవిష్యత్ రేపిస్టులను ఆపుతుందా ?? ఒక ముఖ్యమైన ప్రశ్న... ప్రతి రేపిస్టును ఒకే విధంగా చూస్తారా ... వారి సామాజిక స్థితితో సంబంధం లేకుండా?!" అంటూ ప్రశ్నించారు.