Asianet News TeluguAsianet News Telugu

మహీంద్రా స్కార్పియో క్లాసిక్ ఈ ఫీచర్స్ గురించి తెలుసా.. పాత మోడల్ తో పోల్చితే ఎలా ఉంటుందంటే..

పాత స్కార్పియోలో కంపెనీ పాత లోగో ఉంటుంది. అయితే కొత్త స్కార్పియో క్లాసిక్‌లో కంపెనీ కొత్త లోగోను ఇచ్చింది. ఈ కొత్త లోగో మొదట XUV700లో ఇచ్చారు. ఆ తర్వాత కంపెనీ అన్ని SUVలలో కొత్త లోగోను ఉపయోగించింది. 

You might not know these features of Scorpio Classic, know how it is different from the old Scorpio
Author
First Published Oct 13, 2022, 1:27 PM IST

మహీంద్రా అండ్ మహీంద్రా ఇండియన్ మార్కెట్లో కొత్త స్కార్పియో ఎన్‌ని ప్రవేశపెట్టిన సంగతి మీకు తెలిసిందే. అయితే కేవలం అరగంటలో కంపెనీ కొత్త స్కార్పియో ఎన్‌ కోసం లక్షకు పైగా బుకింగ్‌లను పొందింది. అయితే దీన్ని లాంచ్ చేయడంతో పాటు కంపెనీ స్కార్పియో క్లాసిక్‌ని కూడా పరిచయం చేసింది. పాత స్కార్పియోతో పోలిస్తే స్కార్పియో క్లాసిక్‌కి మధ్య ఉన్న తేడా ఏమిటో  చూద్దాం..

లుక్‌లోనే తేడా
 స్కార్పియో క్లాసిక్ పాత స్కార్పియో లాగానే కనిపిస్తుంది. అయితే కొన్ని మార్పులు చేశారు. ఈ మార్పులను ఫ్రంట్ బంపర్‌లో చూడవచ్చు. కంపెనీ క్లాసిక్‌లో కొత్త గ్రిల్‌ను అందించింది. ఇందులో క్రోమ్ ఉపయోగించారు. ఫాగ్ ల్యాంప్స్‌లో కూడా క్రోమ్‌ను ఉపయోగించారు. ఎస్‌యూ‌వి హెడ్‌ల్యాంప్‌లు అండ్ డి‌ఆర్‌ఎల్ లలో కూడా మార్పులు చేసారు.

కొత్త లోగో 
పాత స్కార్పియోలో కంపెనీ పాత లోగో ఉంటుంది. అయితే కొత్త స్కార్పియో క్లాసిక్‌లో కంపెనీ కొత్త లోగోను ఇచ్చింది. ఈ కొత్త లోగో మొదట XUV700లో ఇచ్చారు. ఆ తర్వాత కంపెనీ అన్ని SUVలలో కొత్త లోగోను ఉపయోగించింది. పాత వాటితో పోలిస్తే క్లాసిక్‌లో కొత్తగా డిజైన్ చేసిన డ్యూయల్ టోన్ అల్లాయ్‌లు చూడవచ్చు. ఈ SUVలో ఫుల్ ఫంక్షనల్ రూఫ్ రైల్స్ ఇచ్చారు.

ఇంటీరియర్ కూడా మారిపోయింది
పాతదానితో పోలిస్తే స్కార్పియో క్లాసిక్ ఇంటీరియర్‌లో కూడా మార్పులు ఉన్నాయి. పాత స్కార్పియో లాగానే SUV క్యాబిన్ లేఅవుట్‌ను అలాగే ఉంచింది. కానీ క్లాసిక్‌లో దీనికి డ్యూయల్ టోన్ థీమ్ ఇంకా తొమ్మిది అంగుళాల ఆండ్రాయిడ్ టచ్‌స్క్రీన్‌తో వస్తుంది, అండ్ 16 GB ఇంటర్నల్ మెమరీ ఇచ్చారు. పాత SUVలో టచ్‌స్క్రీన్‌ ఏడు అంగుళాలలో ఉంటుంది.

క్లాసిక్ కొత్త ఇంజిన్‌
మహీంద్రా స్కార్పియో క్లాసిక్‌కి కంపెనీ కొత్త అండ్ మెరుగైన ఇంజన్‌ని అందించింది. ఇందులో కొత్త జనరేషన్ 2.2 లీటర్ టర్బో చార్జ్డ్ mHawk డీజిల్ ఇంజన్‌ని చూడవచ్చు. ఈ ఇంజన్ పాత ఇంజన్ కంటే 55 కిలోల వరకు తేలికగా ఉంటుంది. ఈ కొత్త ఇంజన్‌తో, SUV పాత మోడల్ కంటే ఎక్కువ శక్తివంతంగా ఉంటుందని, దాని NVH స్థాయి కూడా తగ్గిందని కంపెనీ అభిప్రాయపడింది.

స్కార్పియో పవర్ 
స్కార్పియో క్లాసిక్  కొత్త ఇంజన్ 130 బిహెచ్‌పి, 300 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ SUVకి 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ అందించారు. కంపెనీ గేర్  ట్రాన్స్‌మిషన్‌లో కూడా మార్పులు చేసింది. ఇప్పుడు క్లాసిక్‌కి కేబుల్ గేర్‌బాక్స్ ఇచ్చారు, ఇది పాత మోడల్ కంటే మెరుగైన రీతిలో గేర్‌లను మారుస్తుంది.

క్లాసిక్ ఎన్ని వేరియంట్లలో

పాత స్కార్పియోలో ఎన్నో వేరియంట్లు ఉన్నాయి. మరోవైపు స్కార్పియో క్లాసిక్ కేవలం రెండు వేరియంట్‌ల ఆప్షన్స్ ఉన్నాయి. క్లాసిక్‌లో కంపెనీ S అండ్ S11 వేరియంట్‌ల ఆప్షన్ మాత్రమే అందిస్తుంది. ఎస్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.11.99 లక్షలు. దీని టాప్ వేరియంట్ S11 ఎక్స్-షోరూమ్ ధర రూ. 15.49 లక్షలు.

Follow Us:
Download App:
  • android
  • ios