Asianet News TeluguAsianet News Telugu

యమహా నుండి కొత్త డార్క్ నైట్ ఎడిషన్‌.. ఇప్పుడు మరింత క్రేజీ లుక్స్ తో అప్ డేట్ గా వచ్చేస్తోంది..

టెక్నికల్ గా  ఈ వెర్షన్ స్టాండర్డ్  బైక్‌తో సమానంగా ఉంటుంది. అంటే లిక్విడ్ కూల్డ్, 155సీసీ, సింగిల్ సిలిండర్ ఇంజన్ ఒకేలా ఉంటుంది. ఈ 155సీసీ, సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్ 18.4బిహెచ్‌పి పవర్,  14.2ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 

Yamaha with Dark Night Edition for YZF-R15 V4-sak
Author
First Published May 25, 2023, 6:35 PM IST

జపనీస్ ద్విచక్ర వాహన బ్రాండ్ యమహా మోటార్ ఇండియా పాపులర్ మోడల్ YZF-R15 V4 బైక్ ని అప్ డేట్ చేసింది. ఇప్పుడు ఈ బైక్ కొత్త 'డార్క్ నైట్' కలర్ స్కీమ్‌తో వస్తుంది.  ఈ బైక్  ఎరుపు, నీలం, తెలుపు రంగులలో కూడా అందుబాటులో ఉంది, దీని ధర  రూ. 1.81 లక్షలు నుండి  1.82 లక్షలు నుండి  1.86 లక్షలా వరకు ఉంటుంది. పైన పేర్కొన్న ధరలన్నీ ఎక్స్-షోరూమ్ ధరలకు చెందినవి. Yamaha R15 V4 డార్క్ నైట్‌లో ఎటువంటి ఇతర మార్పులు చేయలేదు.

టెక్నికల్ గా  ఈ వెర్షన్ స్టాండర్డ్  బైక్‌తో సమానంగా ఉంటుంది. అంటే లిక్విడ్ కూల్డ్, 155సీసీ, సింగిల్ సిలిండర్ ఇంజన్ ఒకేలా ఉంటుంది. ఈ 155సీసీ, సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్ 18.4బిహెచ్‌పి పవర్,  14.2ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ట్రాన్స్మిషన్ డ్యూటీస్ చూస్తే 6-స్పీడ్ గేర్‌బాక్స్ సహాయంతో,  స్లిప్పర్ క్లచ్‌తో నిర్వహించబడతాయి. దీని స్టాపింగ్ పవర్ 282mm ఫ్రంట్ డిస్క్, 220mm బ్యాక్  డిస్క్ బ్రేక్‌ల నుండి వస్తుంది. యమహా R15 V4 డ్యూయల్-ఛానల్ ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)ని పొందుతుంది. సస్పెన్షన్ సెటప్‌లో ముందు భాగంలో USD ఫోర్క్,  వెనుకవైపు మోనోషాక్ ఉన్నాయి.

Yamaha R15 V4 మొత్తం పొడవు, వెడల్పు ఇంకా ఎత్తు 1990mm, 725mm అండ్  1135mm. ఈ బైక్ 1325 mm వీల్‌బేస్ అలాగే 170 mm గ్రౌండ్ క్లియరెన్స్‌తో వస్తుంది. బైక్ 815 ఎంఎం  సీట్ ఎత్తుకు చేరుకుంటుంది. డ్యూయల్-ఫంక్షనల్ హెడ్‌లైట్, LED పొజిషన్ లైట్లు, సైడ్ స్టాండ్ ఇంజన్ కట్-ఆఫ్ స్విచ్, ఫుల్ డిజిటల్ LCD మీటర్ కన్సోల్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఇంకా యమహా Y-కనెక్ట్ యాప్ వంటి కొన్ని ముఖ్యమైన  ఫీచర్లు ఉన్నాయి.

  Yamaha నుండి ఇతర వార్తలను పరిశీలిస్తే  MT-03తో పాటు Yamaha R3ని త్వరలో భారతదేశంలో తిరిగి తీసుకురానున్నట్లు నివేదికలు ఉన్నాయి. రెండు మోడళ్లలో 321 సిసి, లిక్విడ్-కూల్డ్ ఇంజన్ అమర్చారు. ఇది 42 PS పవర్ మరియు 29 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌లో ముందువైపు 298ఎమ్ఎమ్ డిస్క్, వెనుకవైపు 202ఎమ్ఎమ్ బ్రేక్ ఉన్నాయి. సస్పెన్షన్ సెటప్‌లో USD ఫోర్క్ అండ్ లింక్డ్ మోనోషాక్ యూనిట్ ఉన్నాయి. కంపెనీ రాబోయే నెలల్లో MT-03 స్పోర్ట్స్ నేకెడ్ బైక్, MT-07 అలాగే  MT-09 స్ట్రీట్ నేకెడ్ బైక్‌లను కూడా విడుదల చేయనుంది.  

Follow Us:
Download App:
  • android
  • ios