యమహా ఎఫ్‌జడ్ & ఫాజర్ 25 మోడల్స్ రీకాల్

యమహా తన ఎఫ్ జడ్ 25, ఫాజర్ 25 మోడల్ బైక్‌లను రీకాల్ చేయాలని నిర్ణయించింది. గతేడాది ఫిబ్రవరిలో విపణిలోకి విడుదల చేసిన 13,348 బైకులను రీకాల్ చేసి సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని నిర్ణయించింది.

Yamaha recalls 13,348 units of two bike models to fix faulty part

న్యూఢిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ యమహా మోటార్స్ బుధవారం తన ఎఫ్‌జడ్ 25, ఫాజర్ 25 మోడల్ బైక్‌లను రీకాల్ చేయాలని నిర్ణయించింది. ఈ రెండు మోడళ్లకు చెందిన 13,348 మోటారు సైకిల్ యూనిట్లను రీకాల్ చేయాలని నిర్ణయించినట్లు బుధవారం వెల్లడించింది. వీటిల్లో తలెత్తిన టెక్నికల్ సమస్యను గుర్తించి తగు చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించింది. 

also read వచ్చేనెల విపణిలోకి టాటా నెక్సన్ ఎలక్ట్రిక్ కార్

ఎఫ్‌జడ్ 25 మోటారు బైక్‌లు 12,620 యూనిట్లు, ఫాజర్ 25 బైక్‌లు 728 యూనిట్లు రీకాల్ చేస్తున్నట్లు యమహా తెలిపింది. గతేడాది జూన్ నెలలో వీటిని యమహా ఉత్పత్తి చేసింది. గతేడాది జూన్ నెలలో ఉత్పత్తి చేసిన ఎఫ్‌జడ్ 25, ఫాజర్ 25 మోడల్ బైక్‌లను తక్షణం మార్కెట్ నుంచి ఉపసంహరించాలని నిర్ణయించింది. 

Yamaha recalls 13,348 units of two bike models to fix faulty part

హెడ్ కవర్ బోల్ట్ లూజనింగ్ సమస్యను పరిష్కరించేందుకు యమహా మోటార్ సైకిల్ సంస్థ స్వచ్ఛందంగా ఈ బైక్‌లను రీకాల్ చేస్తోంది. ఎఫెక్టెడ్ మోటారు సైకిళ్లను ఉచితంగా మరమ్మతు చేస్తామని యమహా ఇండియా తెలిపింది. సంబంధిత డీలర్లను సంప్రదించినా, వ్యక్తిగతంగా కంపెనీని సంప్రదించినా రిపేర్ చేసేస్తామని పేర్కొన్నది. 

కాగా, ఈ నెల ప్రారంభంలోనే యమహా ఎఫ్ జడ్ వీ3, ఎఫ్ జడ్ ఎస్ వీ3, ఎఫ్ జడ్ 25, ఫాజర్ 25 మోడల్ బైక్‌ల ధరలను స్వల్పంగా పెంచుతూ యమహా ఇండియా నిర్ణయం తీసుకున్నది. ఈ ఎఫ్ జడ్ 25, ఫాజర్ 25 మోటారు బైక్‌లతో యమహా మోటార్ సైకిల్స్‌కు విస్త్రుతమైన ఆదరణ లభిస్తోంది. 

also read హ్యుండాయ్ సరికొత్త సెడాన్ ‘అరా’...వ్యక్తిగత వినియోగదారులే టార్గెట్

ఈ ఏడాది జనవరిలో ఈ రెండు మోడల్ మోటారు సైకిళ్ల అప్ డేట్ వర్షన్లను విపణిలో ఆవిష్కరించింది. యమహా ఎఫ్ జడ్ 25 బైక్ ధర రూ.1.33 లక్షలు కాగా, ఫాజర్ 25 మోడల్ బైక్ ధర రూ.1.43 లక్షలుగా నిర్ణయించారు. ఈ రెండు మోటారు సైకిళ్లను డ్యుయల్ చానెల్ ఏబీఎస్ (యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్)తో ఆవిష్కరించింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios