Yamaha: అతిత్వరలో ఇండియాలోకి యమహా బయోఫ్యూయల్ బైక్.. మరో రెండేళ్లలో 10 కంటే ఎక్కువ మోడల్స్ లాంచ్..

జపాన్‌కు చెందిన యమహా మోటార్ సింథటిక్-ఫ్యూయెల్  బైక్ ను "అతి త్వరలో" ఆసియాలోకి తీసుకొచ్చేందుకు సిద్దమవుతుంది. అయితే ఈ సెగ్మెంట్‌లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విస్తరణ గురించి కూడా కంపెనీ మరింత జాగ్రత్తగా ఉంది.

Yamaha Motor to launch biofuel motorcycle in Asia 'very soon', reveals report

జపాన్‌కు చెందిన యమహా మోటార్ సింథటిక్-ఫ్యూయెల్  బైక్ ను "అతి త్వరలో" ఆసియాలోకి తీసుకురావాలని యోచిస్తోంది. అయితే ఈ సెగ్మెంట్‌లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల గురించి కంపెనీ మరింత జాగ్రత్తగా వహిస్తుంది. నిక్కీ ఆసియాలో ప్రచురించిన నివేదికలో ఈ సమాచారం అందించారు.

సింథటిక్ ఫ్యూయెల్ ని బయోఇథనాల్ అండ్ ఇతర ముడి పదార్ధాల నుండి తయారు చేస్తారు. ప్రయాణీకుల వాహనాలలో విటి వినియోగం డీకార్బనైజేషన్ మార్గంలో ఒక ముందు అడుగుగా పరిగణించబడుతుంది.

యమహా మోటార్ ప్రెసిడెంట్ యోషిహిరో హిడాకా నిక్కీ ఆసియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  "మేము కొన్ని స్పెసిఫికేషన్‌లలో మార్పులు చేయవలసి వచ్చినప్పటికీ వాహన ట్యాంక్‌లో బయో ఫ్యూయెల్ పోసిన ఇంటర్నల్ కంబషన్ ఇంజన్  పని చేస్తుంది" అని అన్నారు.

కంపెనీ ఇప్పటికే బ్రెజిల్‌లో గ్యాసోలిన్ అండ్ ఇథనాల్ మిశ్రమంతో నడిచే కొన్ని స్పోర్ట్స్ బైకులను విక్రయించింది. భారతదేశం, ఇండోనేషియా వంటి దేశాల్లో "అతి త్వరలో" ఇలాంటి బైక్‌లను పరిచయం చేయవచ్చని కంపెనీ పేర్కొంది. అటువంటి బైక్‌ల ఉత్పత్తి వివరాలను చర్చించేందుకు యమహా స్థానిక పరిశ్రమ సంఘాల ద్వారా అధికారులతో చర్చలు జరుపుతోంది.

యమహా వార్షిక షిప్‌మెంట్‌లలో ఆసియా వాటా 80 శాతం. వాహనాల విద్యుదీకరణ వ్యూహంలో భాగంగా, కంపెనీ 2024 నాటికి ప్రపంచవ్యాప్తంగా 10 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ బైక్స్ మోడళ్లను పరిచయం చేయాలని యోచిస్తోంది. కానీ యోషిహిరో హిడాకా మాట్లాడుతూ, "ఆసియా ప్రాంతంలో అన్ని రకాల ఎలక్ట్రిక్‌ వాహనాలను లాంచ్ చేసేందుకు మేము తొందరపడటం లేదు." అని అన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios