Asianet News TeluguAsianet News Telugu

యమహా కొత్త బి‌ఎస్-6 బైక్... అల్ న్యూ ఫీచర్స్

యమహా మోటర్స్ ఇండియా వైజెడ్ఎఫ్-ఆర్15 వి3.0 బిఎస్ 6 వెర్షన్‌ను భారత్‌లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. కొత్త యమహా వైజెడ్ఎఫ్-ఆర్15 బిఎస్ 6 మోడల్ ధర 1.45 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).
 

yamaha launches its bs 6 bike varient
Author
Hyderabad, First Published Dec 9, 2019, 4:42 PM IST

యమహా కంపెనీ బి‌ఎస్6 బైకులపై పై దృష్టి పెట్టింది. యమాహా  వైజెడ్ఎఫ్-ఆర్15 (వెర్షన్ 3.0) BS6 (ఐవైఎం) సోమవారం లాంచ్‌ చేసింది. కొత్త ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా దీని ఇంజిన్‌ ఉంటుంది. రేడియల్ టైర్, సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్ స్విచ్, డ్యూయల్ హార్న్‌తో సహా స్టాండర్డ్ ఫీచర్లు దీనికి ఉన్నాయి.

also read  బీఎండబ్ల్యూ నుంచి మరో కొత్త రేస్ మోడల్ కారు...

యమహా మోటర్స్ ఇండియా వైజెడ్ఎఫ్-ఆర్15 వి3.0 బిఎస్ 6 వెర్షన్‌ను భారత్‌లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. కొత్త యమహా వైజెడ్ఎఫ్-ఆర్15 బిఎస్ 6 మోడల్ ధర 1.45 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).ఈ మోడల్ బైక్ ఇప్పుడు బిఎస్ 4 వెర్షన్ ధర కంటే 2 వేలు ఎక్కువ.

yamaha launches its bs 6 bike varient

యమాహా కంపెనీ గత నెలలో బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అప్‌గ్రేడ్ చేయబడిన యమహా ఎఫ్‌జెడ్ మరియు ఎఫ్‌జెడ్ఎస్ బైక్లతో పాటు ఇప్పుడు ఆర్15 బిఎస్ 6 మార్కెట్లో అందుబాటులోకి వస్తుంది. యమహా ఆర్15 బిఎస్ 6 బైక్ బిఎస్ 4 వెర్షన్ కంటే 3 కిలోల అధిక బరువు ఉంటుంది.

also read తొమ్మిది నెలల తర్వాత ‘మారుతి’ ఉత్పత్తి పెంపు

అప్‌గ్రేడ్ చేసిన 155 సిసి, సింగిల్ సిలిండర్, లిక్విడ్-కూల్డ్ బిఎస్ 6 ఇంజిన్‌తో 10,000 ఆర్‌పిఎమ్ వద్ద 18.3 బిహెచ్‌పికి ట్యూన్ చేయబడింది. 8500 ఆర్‌పిఎమ్ వద్ద 14.1 ఎన్ఎమ్ పీక్ టార్క్ లభిస్తుంది. బైకుకి 6-స్పీడ్ గేర్ ట్రాన్స్‌మిషన్‌, హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్‌లు ఉన్నాయి. బ్రేకింగ్ వచ్చేసి డ్యూయల్-ఛానల్ ఎబిఎస్‌తో డ్యూయల్ డిస్క్  బ్రేక్స్ ఉంటాయి.

కొత్త YZF-R15 V3.0 BS6 రేసింగ్ బ్లూ, థండర్ గ్రే, డార్క్నైట్ మూడు కలర్లలో లభిస్తుంది.  డిసెంబర్ మూడవ వారం నుండి భారతదేశంలోని అన్ని కంపెనీ డీలర్‌షిప్‌లలో లభిస్తుందని ఐవైఎం ఒక ప్రకటనలో తెలిపింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios