న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ తమ వినియోగదారులకు తీపికబురు అందించింది. మార్కెట్‌లోకి త్వరలో మరో కొత్త మోడల్ కారును విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. బీఎండబ్ల్యూ ఎం4 జీటీ3 కారు టీజర్‌ను విడుదల చేసింది.

కొత్త కారును రూపొందిస్తున్నట్లు, టెస్టింగ్ కూడా ప్రారంభమైనట్లు కంపెనీ తెలిపింది. 2022లో ఎం4 జీటీ3 కారును విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. కారు ధర ఎంత ఉంటుందనేది అధికారికంగా కంపెనీ ఇంకా ప్రకటించలేదు.

also read 63వేల కార్లను రీకాల్ చేసిన మారుతి సుజుకి...కారణం ?

టూ డోర్ మోన్‌స్టర్ కార్ల ప్రమోషన్ కోసం సుదీర్ఘ కాలంగా బీఎండబ్ల్యూ వేచి చూస్తోంది. ఎం4 జీటీ3 రేస్ కారు స్టయిల్‌గా ఉంటుంది. స్టాండర్డ్ 4 సిరీస్‌లో బీఎండబ్ల్యూ మాసివ్ కిడ్నీ గ్రిల్లే వాడుతుంది. న్యూ ఎం4 జీటీ3లో కొత్త ఫీచర్లు ఉన్నాయి. ఎం4లో టర్బో చార్జ్‌డ్ ఎస్58 ఇన్ లైన్ సిక్స్ ఇంజిన్‌తో కార్లు రోడ్డెక్కుతాయి.

స్పెసిఫిక్ హార్స్ పవర్ ఎంత అన్నది బీఎండబ్ల్యూ వెల్లడించలేదు. అయితే ఎం4 కారు 500 హెచ్పీ కంటే ఎక్కువ సామర్థ్యం కలిగి ఉండొచ్చు. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఎక్స్3, ఎక్స్ 4 ఎం కార్లలో 510 హెచ్పీ సామర్థ్యం గల ఇంజిన్లను వినియోగించింది బీఎండబ్ల్యూ. 

also read విపణిలోకి మహీంద్రా తొలి బీఎస్-6 ‘ఎక్స్‌యూవీ 300’

జీటీ3 మోడల్ కారు వచ్చే ఏడాది ద్వితీయార్థంలో వెలుగులోకి రానున్నది. 2020 సెప్టెంబర్ నెలలో ఫ్రంక్ ఫర్ట్ మోటార్ షోలో ఈ కారును బీఎండబ్ల్యూ ప్రదర్శించనున్నది. అలాగని ఎం4 మోడల్ జీటీ3 కారు ఉత్పత్తిని వెంటనే ప్రారంభిస్తారని చెప్పలేమని పేర్కొంది. డీలర్ల కోసం ప్రత్యేకించి ఎం8 మోడల్ కారును రూపొందిస్తున్నది. 

అంతా ఊహించినట్లు జరిగితే 2022లో అమెరికా మార్కెట్లో విడుదల చేసేందుకు బీఎండబ్ల్యూ ప్రణాళికలు సిద్ధం చేసింది. అదే ఏడాది జరిగే మోటార్ రేసింగ్ షోల్లో దీన్ని వాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.