Asianet News TeluguAsianet News Telugu

18 నెలల్లోనే రెండు కోట్ల లీటర్ల పెట్రోలు ఆదా చేశాం.. కీలక గణాంకాలను వెల్లడించిన కంపెనీ సీఈఓ..!

కంపెనీ విక్రయించే బ్యాటరీతో నడిచే ద్విచక్ర వాహనాలు మొత్తం ఒక బిలియన్ లేదా 100 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించాయని, మొదటి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విక్రయించిన 18 నెలల్లోనే ఈ మైలురాయిని సాధించామని, ఈ స్కూటర్లు మొత్తం కలిసి రెండు కోట్ల లీటర్ల పెట్రోల్ ఆదా చేశాయని భవిష్ అగర్వాల్ చెప్పారు. 
 

Within 18 months, we have saved two crore liters of petrol says   ola ceo -sak
Author
First Published May 30, 2023, 1:48 PM IST

ఇండియన్ ఎలక్ట్రిక్ టు వీలర్ తయారీ సంస్థ ఓలాకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్లు 18 నెలల్లో దేశంలో రెండు కోట్ల లీటర్ల పెట్రోల్‌ను ఆదా చేశాయి. నివేదికల ప్రకారం, ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లకు సంబంధించిన కీలక గణాంకాలను వెల్లడించారు. ఇది గ్రీన్ మొబిలిటీకి దారితీస్తుందని కూడా ఆయన పేర్కొన్నారు. 

కంపెనీ విక్రయించే బ్యాటరీతో నడిచే ద్విచక్ర వాహనాలు మొత్తం ఒక బిలియన్ లేదా 100 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించాయని, మొదటి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విక్రయించిన 18 నెలల్లోనే ఈ మైలురాయిని సాధించామని, ఈ స్కూటర్లు మొత్తం కలిసి రెండు కోట్ల లీటర్ల పెట్రోల్‌ ఆదా చేశాయని భవిష్ అగర్వాల్ చెప్పారు.  ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పటికే దేశవ్యాప్తంగా 2,50,000 గృహాలకు చేరుకున్నాయని,  ప్రయాణం వేగవంతం అవుతోందని  భవిష్ అగర్వాల్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసారు. 

కంపెనీ తొలిసారిగా  S1 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆగస్టు 2021లో దేశంలో విడుదల చేసింది. అదే సంవత్సరం డిసెంబర్‌లో మొదటి డెలివరీ జరిగింది. కంపెనీ ప్రారంభంలో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఎస్1 అండ్ ఎస్1 ప్రో అనే రెండు వెర్షన్లలో విడుదల చేసింది. ఇప్పుడు కంపెనీ మూడవ ఎడిషన్ S1 ఎయిర్‌ను కూడా పరిచయం చేసింది. ఇది కంపెనీ   చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్ వెర్షన్. S1 ఎయిర్ కోసం కంపెనీ ఇప్పటికే బుకింగ్‌లను  ప్రారంభించగా, దాని సేల్స్ విండో, టెస్ట్ రైడ్‌లు ఇంకా డెలివరీలు జూలై నుండి ప్రారంభమవుతాయి. Ola S1 ఎయిర్ బ్యాటరీ ప్యాక్‌పై ఆధారపడి మూడు ట్రిమ్‌లలో కస్టమర్లకు అందుబాటులో ఉంది. ఈ ట్రిమ్‌లు 2 kWh, 3 kWh అండ్ 4 kWh బ్యాటరీ ప్యాక్‌లను కలిగి ఉంటాయి. ఒకే ఛార్జ్‌పై విభిన్న పరిధులను అందిస్తుంది.

ఓలా ఎలక్ట్రిక్ ఇటీవలే  రాబోయే బ్యాటరీ సెల్ గిగాఫ్యాక్టరీ నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది, ఇది భారతదేశంలో అతిపెద్ద EV సెల్ సదుపాయంగా ఉంటుందని హామీ ఇచ్చింది. ఇది తమిళనాడులోని కృష్ణగిరిలో నెలకొల్పబడుతుంది ఇంకా  సంవత్సరానికి 10 గిగావాట్ గంటల (GWh) ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని హామీ ఇచ్చింది.

అగర్వాల్ దీనికి సంబంధించి ఫోటోలను  ట్విట్టర్‌లో షేర్ చేసారు. ఎలక్ట్రిక్ మొబిలిటీ సెగ్మెంట్‌లో కంపెనీ మరిన్ని ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలపై పని చేస్తున్నందున, కొత్త గిగాఫ్యాక్టరీ EV రంగంలో సమగ్రమైన ముందడుగు కోసం ఓలా  ప్రణాళికలకు అనుగుణంగా ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios