రూ. 15 లక్షలలో బెస్ట్ ఎలక్ట్రిక్ కారు ఏది.. ఫీచర్స్ ఏంటి, మైలేజ్ ఎంత తెలుసుకోండి
ఇండియన్ ఎలక్ట్రిక్ వాహనతయారీ సంస్థ టాటా సెప్టెంబర్ 28న Tiago EVని భారత మార్కెట్లో లాంచ్ చేసింది. లాంచ్ అయిన తర్వాత ఈ కారు ఇండియాలో అత్యంత బడ్జెట్ ఎలక్ట్రిక్ కారుగా అవతరించింది.
పెట్రోల్ డీజిల్ కార్లకు బదులు మీరు కూడా ఎలక్ట్రిక్ కార్ కోసం చూస్తున్నట్లయితే రూ. 15 లక్షల బడ్జెట్‌లో ఇండియాలో అందుబాటులో ఉన్న ఈ ఎలక్ట్రిక్ కార్ల గురించి తెలుసుకోండి. ఈ ఎలక్ట్రిక్ కార్ల ఎక్స్-షోరూమ్ ధర, వాటి రేంజ్, ఫీచర్ల గురించి మీకోసం...
టాటా టియాగో ఈవి
ఇండియన్ ఎలక్ట్రిక్ వాహనతయారీ సంస్థ టాటా సెప్టెంబర్ 28న Tiago EVని భారత మార్కెట్లో లాంచ్ చేసింది. లాంచ్ అయిన తర్వాత ఈ కారు ఇండియాలో అత్యంత బడ్జెట్ ఎలక్ట్రిక్ కారుగా అవతరించింది. ఈ ఎలక్ట్రిక్ కారులో కంపెనీ రెండు బ్యాటరీ ప్యాక్‌ల ఆప్షన్ ఇచ్చింది. 19.2 KWH బ్యాటరీతో కంపెనీ ప్రకారం కారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్ల వరకు నడపవచ్చు. అంతేకాకుండా 24 KWH పెద్ద బ్యాటరీతో ఒక్కసారి ఛార్జింగ్‌లో 315 కిలోమీటర్లు నడపవచ్చు. 7.2 kW ఛార్జర్‌తో మూడు గంటల 36 నిమిషాల్లో కారును ఫుల్ ఛార్జ్ చేయవచ్చు అలాగే DC ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగిస్తే కేవలం 57 నిమిషాల్లో 10 నుండి 80 శాతం ఛార్జ్ చేయవచ్చు. కారులోని ఫీచర్ల గురించి చెప్పాలంటే, ఆటో ఏసీ, ఆటో క్లైమేట్ కంట్రోల్, పంక్చర్ రిపేర్ కిట్, కనెక్టెడ్ కార్ టాక్ వంటి స్టాండర్డ్ ఫీచర్లు ఇందులో ఇచ్చారు. ఈ ఎలక్ట్రిక్ కారులో స్పోర్ట్స్ మోడ్, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, ఐ టీపీఎంఎస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.8.49 లక్షల నుండి ప్రారంభమవుతుంది. టాప్ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ.11.79 లక్షలు. మీరు ఈ కారును బుక్ చేయాలనుకుంటే అక్టోబర్ 10 నుండి బుకింగ్ ప్రారంభమవుతుంది. జనవరి 2023 నుండి Tiago EV డెలివరీలు ప్రారంభిస్తుంది.
టాటా టిగోర్ ఈవి
టాటా కంపెనీ ఎలక్ట్రిక్ కార్లలో టిగోర్ రెండవ స్థానంలో ఉంది. టిగోర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.12.49 లక్షల నుండి ప్రారంభమవుతుంది. టాప్-ఎండ్ వేరియంట్ ధర ఎక్స్-షోరూమ్ రూ.13.64 లక్షల నుండి ప్రారంభమవుతుంది. కంపెనీ ప్రకారం, Tigor EV ఒక్కసారి ఛార్జ్ చేస్తే 306 కి.మీ. ఫాస్ట్ ఛార్జర్‌తో కారును కేవలం 65 నిమిషాల్లో జీరో నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. దీనితో పాటు పవర్ సాకెట్ నుండి ఈ కారును ఛార్జ్ చేయడానికి ఎనిమిది గంటల 45 నిమిషాలు పడుతుంది. కారు బ్యాటరీ IP67 సర్టిఫైడ్ రేటింగ్ పొందింది. సేఫ్టీ కోసం కారు డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, EBD, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్ ఫీచర్ పొందుతుంది.
టాటా నెక్సన్ ఈవి
టాటా కంపెనీ కార్లలో మూడవ స్థానంలో టాటా ఎలక్ట్రిక్ కారు నెక్సాన్ ఉంది. Nexon EV ప్రైమ్ ఇండియాలో మూడవ చౌకైన ఎలక్ట్రిక్ కారు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 14.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది అలాగే టాప్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 17.50 లక్షల. అయితే నెక్సాన్‌లో EV మ్యాక్స్, డార్క్ ఎడిషన్ అండ్ జెట్ ఎడిషన్ కూడా ఉన్నాయి. Nexon EV ప్రైమ్ ఫాస్ట్ ఛార్జర్‌తో 60 నిమిషాల్లో 10 నుండి 80 శాతం ఛార్జ్ అవుతుంది . సాధారణ ఛార్జింగ్ పాయింట్ నుండి ఛార్జ్ చేస్తే తొమ్మిది గంటల 10 నిమిషాల్లో 10 నుండి 90 శాతం ఛార్జ్ అవుతుంది. ఎలక్ట్రిక్‌గా ఉన్నప్పటికీ, ఈ కారు సున్నా నుండి 100 కి.మీ స్పీడ్ 9.9 సెకన్లలో అందుకుంటుంది. కారు సేఫ్టీ కోసం ఫుల్ ఫైవ్ స్టార్ పొందింది. డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, EBD, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు ఇంకా ఈ కారులో బ్యాటరీ IP67 రేటింగ్ పొందింది.