Asianet News TeluguAsianet News Telugu

క్రెడిట్ స్కోర్ అంటే ఏంటి.. కారు కొనేటప్పుడు ఎందుకు ముఖ్యం.. ఎలా చెక్ చేస్తారంటే..?

మీరు ఫైనాన్స్‌ కింద కారు తీసుకోవడానికి సిద్ధమైతే  బ్యాంకులు మీకు తక్కువ వడ్డీకి సులభంగా లోన్ ఇచ్చే అవకాశం ఉండవచ్చు.  ఒకోసారి పరిస్థితి కూడా మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు.

What is credit score, why is it important to buy a car,
Author
First Published Oct 29, 2022, 3:01 PM IST

కారు కొనడానికి ప్లాన్ చేస్తున్నప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఏంటంటే మీరు ఫైనాన్స్‌ కింద కారు తీసుకోవడానికి సిద్ధమైతే  బ్యాంకులు మీకు తక్కువ వడ్డీకి సులభంగా లోన్ ఇచ్చే అవకాశం ఉండవచ్చు.  ఒకోసారి పరిస్థితి కూడా మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. దీనికి క్రెడిట్ స్కోర్ బాధ్యత వహిస్తుంది. అన్నింటికంటే క్రెడిట్ స్కోర్ అంటే ఏంటి, కారు కొనడంలో ఎలా సహాయపడుతుంది అంటే...

క్రెడిట్ స్కోర్ అంటే ఏంటి
ఒక వ్యక్తి క్రెడిట్ హిస్టరీ అర్థం చేసుకోవడం ద్వారా స్కోర్ ఇవ్వబడుతుంది. దీనినే క్రెడిట్ స్కోర్ అంటారు. మీరు తీసుకున్న లోన్ ఇంకా దాని రిపేమెంట్ గురించి పూర్తి సమాచారం ఇందులో  ఉంటుంది. దీని ద్వారా మీరు ఎప్పుడు లోన్ లేదా క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారో తెలుస్తుంది. దీని తర్వాత మీరు సకాలంలో లోన్ చెల్లించారా లేదా కూడా తెలుస్తుంది.

మీ పూర్తి సమాచారం
క్రెడిట్ కార్డ్, బ్యాంక్ అక్కౌంట్ మొదలైనవి ఏదైనా తీసుకున్నప్పుడు కంపెనీ మీ నుండి అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ కాపీని తీసుకుంటుంది. వీటిలో పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్ మొదలైన వాటి సమాచారం ఉంటుంది.

లోన్ ఎలా పొందాలి
క్రెడిట్ స్కోర్‌ను లెక్కించడానికి ఉపయోగించే ఫార్ములా ఒక క్రెడిట్ బ్యూరో నుండి మరొకదానికి భిన్నంగా ఉండవచ్చు. ఈ కారణంగా ఒక వ్యక్తి క్రెడిట్ స్కోర్ ఎప్పటికప్పుడు మారవచ్చు. లోన్ లేదా క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ఆమోదంలో క్రెడిట్ స్కోర్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎవరికైనా క్రెడిట్ స్కోర్ ఎక్కువ ఉంటే క్రెడిట్ కార్డ్ లేదా లోన్ పొందే అవకాశాలు ఎక్కువ.

లిమిట్ ఏంటి 
క్రెడిట్ స్కోర్ 300 మరియు 900 మధ్య ఉంటుంది. మీ క్రెడిట్ స్కోర్ 300-579 మధ్య ఉంటే అది చాలా బ్యాడ్ గా పరిగణించబడుతుంది. అలాగే 580-669 మధ్య ఉంటే సంతృప్తికరంగా పరిగణిస్తారు, 670-739 ఉంటే గుడ్, 740-799  ఉంటే వెరీ గుడ్ అని, 800 కంటే ఎక్కువ ఉంటే బెస్ట్ అని అర్ధం.

కారు ఫైనాన్స్ పొందడంలో  
మీరు కారు కొనడానికి వెళ్లినప్పుడు డీలర్‌షిప్‌లలో కారును లోన్ లో తీసుకుంటారా లేదా అని అడుగుతారు. లోన్ కింద తీసుకోవాలనుకుంటున్న వారిని సంబంధిత అధికారి దగ్గరకి పంపిస్తారు. అతను మీ పూర్తి సమాచారం తీసుకున్న తర్వాత క్రెడిట్ స్కోర్ చెక్ చేస్తారు. మీకు మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే కార్ ఫైనాన్స్ సులభంగా లభిస్తుంది. కానీ మీ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే మీకు ఫైనాన్స్ లభించదు లేదా ఎక్కువ వడ్డీ రేటును అందించవచ్చు.

Follow Us:
Download App:
  • android
  • ios