మీరు కూడా 250సీసీ బైక్ కోనాలనుకుంటున్నారా... అయితే ఈ టాప్-5 బైక్స్ పై లుక్కెయండి..

మీరు కూడా 250cc బైక్ కొనాలనుకుంటున్నారా.. అయితే భారతీయ మార్కెట్లో బడ్జెట్ బైక్  ఆప్షన్స్  చాలా ఉన్నాయి. ఇండియాలోని ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో  గత ఏడాది పాపులర్ బైక్ పల్సర్ కొత్త జనరేషన్ మోడళ్లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. 

want to buy powerful 250cc bike then these are the top-5 options

భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్లో 250 సిసి సెగ్మెంట్ ఎంతో పాపులరిటీ పొందింది. ఎందుకంటే ఈ బైక్స్ చాలా పవర్ ఫుల్ ఇంజన్‌తో వస్తాయి. అలాగే రైడర్లు ఈ బైక్‌లపై  ప్రయాణించటమే కాకుండా  టూరింగ్ అండ్  జాయ్ రైడ్‌లను కూడా ఆస్వాదించవచ్చు. మీరు కూడా 250cc బైక్ కొనాలనుకుంటున్నారా.. అయితే భారతీయ మార్కెట్లో బడ్జెట్ బైక్  ఆప్షన్స్  చాలా ఉన్నాయి. 2 లక్షల (ఎక్స్-షోరూమ్) కంటే తక్కువ ధర ఉన్న 250 సిసి బైక్స్ గురించి  తెలుసుకోండి..

బజాజ్ పల్సర్ ఎన్250 అండ్ ఎఫ్250
ఇండియాలోని ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో  గత ఏడాది పాపులర్ బైక్ పల్సర్ కొత్త జనరేషన్ మోడళ్లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ బైక్స్  N250 అండ్ F250.  ఈ రెండు బైక్స్ కొత్త 250 సిసి ఎయిర్-ఆయిల్ కూల్డ్ ఇంజన్‌తో వస్తాయి. ఈ ఇంజన్ 24.5 PS శక్తిని, 21.5 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.  పల్సర్ ఎన్250 ఎక్స్-షోరూమ్ ధర రూ.1.45 లక్షల నుండి, పల్సర్ ఎఫ్250 ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.41 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 

యమహా ఎఫ్‌జెడ్ 25
యమహా ఎఫ్‌జెడ్ 25 250సి‌సి సెగ్మెంట్‌లో అత్యంత అగ్రెసివ్ గా కనిపించే బైక్స్ లో ఒకటి. కానీ ఈ బైక్ ని పరిశీలించి చూస్తే 2017లో ప్రవేశపెట్టిన FZ 25 లాగా అనిపిస్తుంది. ఈ బైక్ 20.8 PS శక్తిని, 20.1 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసే 250ccతో ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది. యమహా ఎఫ్‌జెడ్ 25 ధర రూ. 1.48 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. 

బజాజ్ డొమినార్ 250 
బజాజ్ డొమినార్ 250 బైక్ బజాజ్ భారతీయ ఉత్పత్తి లైనప్‌లో డొమినార్ 400 కంటే కింద ఉంటుంది. ఈ బైక్ డ్యూక్ 250 లాగానే 250 సిసి ఇంజిన్‌తో వస్తుంది, అయితే ఇందులో చాలా మార్పులు చేసింది. ఈ ఇంజన్ 27 హెచ్‌పి పవర్, 23 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ చుట్టూ ఉన్న అత్యంత శక్తివంతమైన 250cc బైక్స్ లో ఒకటిగా ఉండవచ్చు, కానీ  180kg బరువుతో అత్యంత బరువైనది. బజాజ్ డామినార్ 250 ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.75 లక్షలు. 

సుజుకి జిక్సర్ 250
ఇతర 250సి‌సి బైక్స్ తో పోలిస్తే సుజుకి జిక్సర్ 250  కాస్త ఖరీదైనది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1.81 లక్షలు. అయితే ఈ బైక్ అద్భుతమైన రైడింగ్ అనుభవాన్ని ఇంకా బెస్ట్ ఇంజన్‌ను అందిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 26.5 హెచ్‌పి పవర్, 22.2 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 

సుజుకి జిక్సర్ SF 250
సుజుకి జిక్సర్ SF  అనేది జిక్సర్  ఫుల్-ఫెయిర్డ్ వెర్షన్. అయితే జిక్సర్ SFని స్పోర్టియర్‌గా కనిపించేలా వాహన తయారీ సంస్థ హెడ్‌ల్యాంప్‌లలో మార్పులు చేసింది. ఈ బైక్ కి Gixxer 250  లాంటి ఇంజిన్‌  లభిస్తుంది. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర - 1.92 లక్షలు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios