వోల్వో ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్.. ఇండియాలోనే అత్యంత బడ్జెట్ లగ్జరీ ఈవి.. కేవలం 5 సెకండ్లలోనే..
స్వీడిష్ కార్ల తయారీ సంస్థ వోల్వో గుజరాత్‌లోని ఫస్ట్ కస్టమర్‌కి ఎలక్ట్రిక్ ఎస్‌యూవి మొదటి యూనిట్‌ను డెలివరీ చేసింది. వోల్వో XC40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ SUV ఈ సంవత్సరం మార్చిలో ప్రవేశపెట్టారు. ఏప్రిల్‌లో లాంచ్ జరగాల్సి ఉంది.
లగ్జరీ కార్ బ్రాండ్ వోల్వో ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు వోల్వో ఎక్స్‌సి40 రీఛార్జ్ డెలివరీలను ప్రారంభించింది. ఈ ఏడాది జూలైలో XC40 రీఛార్జ్‌ని లాంచ్ చేసింది, ఈ కార్ ఇండియాలో అత్యంత బడ్జెట్ లగ్జరీ ఎస్‌యూవి. భారత మార్కెట్లో వోల్వో ఎక్స్‌సి40 రీఛార్జ్ ఎక్స్-షోరూమ్ ధర రూ.55.90 లక్షలు. ఇంకా భారతదేశంలో స్థానికంగా అసెంబుల్ చేసిన మొదటి లగ్జరీ SUV. కర్ణాటకలోని బెంగళూరు సమీపంలోని హోస్కోట్ ప్లాంట్‌లో తయారు చేయబడింది. XC40 రీఛార్జ్ లగ్జరీ ఎలక్ట్రిక్ వాహనాలలో కియా EV6తో పోటీపడుతుంది.
స్వీడిష్ కార్ల తయారీ సంస్థ వోల్వో గుజరాత్‌లోని ఫస్ట్ కస్టమర్‌కి ఎలక్ట్రిక్ ఎస్‌యూవి మొదటి యూనిట్‌ను డెలివరీ చేసింది. డెలివరీ సమయంలో వోల్వో కార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ జ్యోతి మల్హోత్రా మాట్లాడుతూ, “ఈ డెలివరీ చారిత్రాత్మకమైనది, 2030 నాటికి ఆల్-ఎలక్ట్రిక్ కార్ కంపెనీగా మారే దిశగా మా ప్రయాణానికి నాంది పలకడమే కాకుండా, మా ప్రతిష్టాత్మకమైన ఆన్‌లైన్ ప్రయాణంలో మొదటగా ప్రారంభించబడుతుంది. డైరెక్ట్ సేల్స్ మోడల్ క్రింద డెలివరీ చేయబడింది అని అన్నారు.
ఎక్స్‌లెంట్ కస్టమర్ రెస్పాన్స్
జ్యోతి మల్హోత్రా మాట్లాడుతూ, వోల్వో ప్రారంభించినప్పటి నుండి XC40 రీఛార్జ్‌పై ప్రోత్సాహకరమైన రెస్పాన్స్ పొందింది. అలాగే ఇప్పటికే దాదాపు 500 ఆర్డర్లు వచ్చాయి. వోల్వో ఈ సంవత్సరం చివరిలోపు భారతీయ రోడ్లపై దాదాపు 100 యూనిట్లను ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఎలక్ట్రిక్ కార్ 150 యూనిట్లు రెండు గంటల్లోనే అమ్ముడయ్యాయి. ప్రస్తుతం మార్కెట్‌లో అత్యంత సరసమైన లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారు ఇదే.
వోల్వో XC40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ SUV ఈ సంవత్సరం మార్చిలో ప్రవేశపెట్టారు. ఏప్రిల్‌లో లాంచ్ జరగాల్సి ఉంది. అయితే, కోవిడ్-19 కారణంగా మూడవ త్రైమాసికానికి వాయిదా వేసింది.
బ్యాటరీ అండ్ రేంజ్
XC40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ SUV 78 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఈ పెద్ద బ్యాటరీ ఫుల్ ఛార్జ్‌పై 400 కి.మీల కంటే ఎక్కువ ప్రయాణించేల సహాయపడుతుంది. అయితే, ఎలక్ట్రిక్ SUV వేరిఫైడ్ మైలేజ్ దాదాపు 335 కి.మీలు.
పవర్ అండ్ స్పీడ్
XC40 రీఛార్జ్ దాని విభాగంలో అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటి, 4.9 సెకన్లలో 0 నుండి 100 kmph స్పీడ్ అందుకుంటుంది. వోల్వో XC40 రీఛార్జ్ ఆల్-వీల్ డ్రైవ్ సెటప్‌తో వస్తుంది. ఇంకా రెండు 204hp ఎలక్ట్రిక్ మోటార్లను పొందుతుంది. 408hp పవర్ అండ్ 660Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అన్ని ఇతర వోల్వో కార్ల లాగానే XC40 రీఛార్జ్ టాప్ స్పీడ్ గంటకు 180 కి.మీకి.
వారంటీ
వోల్వో వారంటీ, సర్వీస్ అండ్ రోడ్‌సైడ్ అసిస్టెన్స్‌పై మూడేళ్ల ప్యాకేజీని కూడా అందిస్తుంది. XC40 రీఛార్జ్ బ్యాటరీ 8 సంవత్సరాల వారంటీ ఇంకా 11kW సామర్థ్యం గల వాల్‌బాక్స్ ఛార్జర్‌తో వస్తుంది.