న్యూఢిల్లీ: జర్మనీ ఆటోమొబైల్ దిగ్గజం వోక్స్ వ్యాగన్ వచ్చేనెలలో పాత మోడల్ కార్లను బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా విపణిలో విడుదల చేయనున్నది. వచ్చేనెల 18వ తేదీన న్యూఢిల్లీలో టీ-రాక్ అనే ఎస్‌యూవీ మోడల్ కారును ఆవిష్కరించనున్నది. 

వోక్స్ వ్యాగన్ టీ-రాక్ ప్రోగ్రెసివ్ డిజైన్ లాంగ్వేజ్ విత్ ఎ కపుల్ స్టైల్ రూఫ్‌తో తయారైంది. ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ హెడ్ లైట్స్, ఎల్ఈడీ డేటైం రన్నింగ్ లైట్స్‌తో రూపుదిద్దుకోనున్నది. స్పోర్టీ లుక్, ఎలక్ట్రిక్ బాడీ కలర్‌తో డ్యూయల్ టోన్ రూఫ్ కలిగి ఉంటుంది. 

టీఎస్ఐ పెట్రోల్ ఇంజిన్, 7-స్పీడ్ డీఎస్జీ గేర్ బాక్స్, పనోరమిక్ సన్ రూఫ్, 6 ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్, ఈఎస్సీ, ఆపిల్ అండ్ ఆండ్రాయిడ్ యూజర్లకు ఇన్ఫోటైన్మెంట్ సొల్యూషన్స్ అందుబాటులోకి తెచ్చింది. తద్వారా కస్టమర్లకు కంఫర్జబుల్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ కల్పించింది. 

టీ-రాక్ 1.5 లీటర్ల పెట్రోల్ ఇంజిన్, 148 బీహెచ్పీ పవర్, 250 ఎన్ఎం టార్చి సామర్థ్యం కలిగి ఉంది. విపణిలో ఆవిష్కరించిన తర్వాత హ్యుండాయ్ క్రెట్టా, కియా సెల్టోస్, ఎంజీ హెక్టార్ కార్లతో వోక్స్ వ్యాగన్ టీ రాక్ పోటీనిస్తుంది. వచ్చే రెండేళ్లలో వోక్స్ వ్యాగన్ నాలుగు ఎస్‌యూవీ మోడల్ కార్లను ఆవిష్కరించనున్నది. 

also read:వాట్సాప్‌ మెసేజ్ ‘బ్లూ’ టిక్స్.. 2014లోనే వినియోగం షురూ!

వోక్స్ వ్యాగన్ బ్రాండ్ బోర్డు సభ్యుడు జౌర్గెన్ స్టాక్ మాన్ స్పందిస్తూ ‘శరవేగంగా ట్రాన్స్ ఫార్మింగ్ అవుతున్న మా సంస్థ చాలా ఎక్సైట్మెంట్‌తో ఉంది. ఎప్పటికప్పుడు భారతదేశ విపణిలో అడుగు పెట్టేందుకు వ్యూహాలను అమలు చేస్తూ ముందడుగు వేస్తున్నాం’ అని చెప్పారు. 

వోక్స్ వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా డైరెక్టర్ స్టీఫెన్ క్నాప్ మాట్లాడుతూ తమ సంస్థ ఎకనమికల్లీ వయబుల్ సేల్స్ నెట్ వర్క్ ఏర్పాటు చేయడంపైనే కేంద్రీకరించిందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 150 టచ్ పాయింట్లను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. సేల్స్ పాయింట్ల ఏర్పాటు విషయంలో 2017తో పోలిస్తే ఇప్పటి వరకు 30 శాతానికి పైగా పురోగతి సాధించాం అని స్టీఫెన్ క్నాప్ వివరించారు