Asianet News TeluguAsianet News Telugu

మహీంద్ర ట్రక్కులో మద్యం అక్రమ రవాణా.. మేం ఇంకా అంతా ఎదగలేదురా బాబు అంటూ ఆనంద్‌ మహీంద్రా ట్వీట్..

ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేశారు. ఇందులో గుజరాత్‌ రాష్ట్రంలో మద్యం అక్రమంగా రవాణా చేస్తున్న ఒక వ్యక్తి  తన వాహనం  కింద భాగంలో స్టోరేజ్ ఏర్పర్చుకుని వందల సంఖ్యలో మద్యం బాటిళ్లు, కార్టన్లు తరలిస్తు  పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ వీడియో చూసిన వారంతా అతని తెలివికి ఆశ్చర్యపోయారు. 

Video of Secret Liquor Drawer in Truck Leaves Anand Mahindra Impressed Says it Wasn't His Design by twitter
Author
Hyderabad, First Published Mar 25, 2021, 11:20 AM IST

 సాధారణంగా ఇళ్ళల్లో ఏదైనా  దాచటానికి లేదా భద్రపర్చటానికి అండర్ గ్రౌండ్ స్టోరేజ్ ఏర్పర్చుకొని వినియోగిస్తుంటారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే  ఇలాంటి దానికి సంబంధించి ఒక వీడియోని ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇందులో గుజరాత్‌ రాష్ట్రంలో మద్యం అక్రమంగా రవాణా చేస్తున్న ఒక వ్యక్తి  తన వాహనం  కింద భాగంలో స్టోరేజ్ ఏర్పర్చుకుని వందల సంఖ్యలో మద్యం బాటిళ్లు, కార్టన్లు తరలిస్తు  పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ వీడియో చూసిన వారంతా అతని తెలివికి ఆశ్చర్యపోయారు. అయితే దీనిపై ఆనంద్‌ మహీంద్రా స్పందిస్తూ  మా  మహీంద్ర వాహనం డిజైనింగ్‌లో ఇది భాగం కాదని భవిష్యత్‌లో  దీనిని ఎప్పటికీ భాగం చేయమంటూ స్పష్టత ఇచ్చారు.
 
 ఆ వ్యక్తి తన వాహనంలో పైకి కనబడకుండా ఏర్పాటు చేసుకున్నా  గ్రౌండ్ స్టోరేజ్ ద్వారా  అక్రమంగా మధ్యం ఎలా తరలిస్తున్నాడో వీడియోలో పూర్తిగా చూపించారు. ఈ వాహనం కింద దాగి ఉన్న క్యాబినెట్ నుండి మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నా ఒక నిమిషం ముప్పై సెకన్ల వీడియో క్లిప్ చూడవచ్చు.

also read బైక్ కొనాలనుకుంటున్నారా.. అయితే వెంటనే కొనేయండి.. ఎందుకంటే ఏప్రిల్‌ 1 నుంచి.. ...

మొదట పోలీసులు  ట్రక్ వెనుక వైపు వాహనం  నంబర్ ప్లేట్ తీయడం చూడవచ్చు తరువాత పోలీసుల బృందం సహాయంతో వారు మద్యం ఉన్న  భారీ డ్రా లాగా కనిపించే దానిని బయటకు తీయగలిగారు.

 అయితే, మహీంద్రా వాహనాలు ఇలాంటి రహస్యమైన డిజైన్లతో రావు అని ఆనంద్ మహీంద్ర హామీ ఇచ్చారు. అలాగే ఈ వీడియో 'పేలోడ్' అనే పదానికి సరికొత్త అర్థాన్ని ఇస్తుందని అన్నారు.  

ఈ వీడియోను శుక్రవారం షేర్ చేసినప్పటి నుండి ట్విట్టర్‌లో 156.7 కే పైగా వీక్షించారు, మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్‌లోని ఈ పోస్ట్‌కు 9.1 కే  పైగా లైక్‌లు, 1.4కె పైగా రీట్వీట్లు వచ్చాయి.

మద్యం అక్రమ రవాణా చట్టవిరుద్ధం అయినప్పటికీ, ఈ ప్లాన్ అమలు చేసే రహస్య మార్గం నెటిజన్లను ఆకట్టుకుంది. ట్విటర్ యూజర్లలో ఒకరు ఈ ఆలోచనను "జబర్దాస్ట్ జుగాడ్ టెక్నాలజీ" అని వివిధ కామెంట్లతో ప్రశంసించారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios