బైక్ ఈ స్పెషల్ స్విచ్ గురుంచి తెలుసా.. పొరపాటున కూడా ఇలా చేయకండి లేదంటే...?
ఈ రోజుల్లో ప్రతి బైక్ అండ్ స్కూటర్‌లో రెడ్ కలర్ స్విచ్ ఉంటుంది. తాళం ఉపయోగించకుండా ఇంజన్‌ను ఆపివేయడం లేదా ఆన్ చేయడం ఈ స్విచ్ ముఖ్యమైన పని.
సాధారణంగా స్కూటర్లకి, బైక్స్ కి వాహన తయారీ కంపెనీలు ఇంజన్ కిల్ స్విచ్ అందిస్తుంటాయి. ఈ స్విచ్ బైక్ నడపడానికి చాలా సౌలభ్యాన్ని ఇస్తుంది. ఈ స్విచ్ సౌలభ్యాన్ని అందించినప్పటికీ దానిని సరిగ్గా ఉపయోగించకతే మీ వాహనానికి హాని కలిగించవచ్చు. దీన్ని తప్పుగా వాడటం వల్ల కలిగే నష్టాలు ఏమిటో తెలుసా..
ఇంజన్ కిల్ స్విచ్ అంటే ఏంటి
ఈ రోజుల్లో ప్రతి బైక్ అండ్ స్కూటర్‌లో రెడ్ కలర్ స్విచ్ ఉంటుంది. తాళం ఉపయోగించకుండా ఇంజన్‌ను ఆపివేయడం లేదా ఆన్ చేయడం ఈ స్విచ్ ముఖ్యమైన పని. ఈ స్విచ్ లేకుండా బైక్ లేదా స్కూటర్ స్టార్ట్ చేయడం అసాధ్యం. దీనినే ఇంజన్ కిల్ స్విచ్ అంటారు. సాధారణంగా ఈ స్విచ్ బైక్‌లు ఇంకా స్కూటర్‌లలో కుడి వైపున ఉంటుంది.
దీని ఉపయోగం ఏమిటి అంటే
ఇంజిన్ కిల్ స్విచ్ ముఖ్యమైన పని ఏంటంటే బైక్ అండ్ స్కూటర్‌ను సులభంగా ఆపరేట్ చేయడం. ఇంజిన్ కిల్ స్విచ్ బైక్ ఇగ్నిషన్ కాయిల్ నుండి కాంటాక్ట్ డిస్‌కనెక్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఇంజిన్ ఆగిపోతుంది. కానీ ఈ స్విచ్ ని తప్పుగా వాడితే బైక్ పాడైపోయే అవకాశం ఉంటుంది.
ఇంజనుకి నష్టం
ఇంజిన్ కిల్ స్విచ్‌ని పదే పదే నొక్కితే బైక్ ఇంజిన్ ప్రభావితమవుతుంది. బైక్ స్టార్ట్ చేయడానికి పెట్రోల్ ని వినియోగించుకుంటుంది. ఈ స్విచ్ ని పదే పదే నొక్కడం ద్వారా ఇంజన్ ఆన్ లేదా ఆఫ్ చేస్తే పెట్రోల్ వినియోగం కూడా ఎక్కువ అవుతుంది. ఇంజిన్ కిల్ స్విచ్‌ని పదే పదే నొక్కడం వల్ల ఇంజిన్ తీవ్రంగా ప్రభావితమవుతుంది. ఇంజిన్ స్టార్టర్ చెడిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఒక్కసారి ఈ స్విచ్ చెడిపోతే బైక్ స్టార్ట్ చేయడం కష్టం.
బ్యాటరీపై కూడా ఒత్తిడి
బైక్‌లు, స్కూటర్‌లను స్టార్ట్ చేయడంలో లేదా ఆఫ్ చేయడంలో ఇంజిన్ కిల్ స్విచ్ చాలా ముఖ్యం. దీనిని బ్యాటరీకి కనెక్ట్ చేయబడి ఉంటుంది. బైక్ లేదా స్కూటర్ స్టార్ట్ చేయడానికి ఇంజిన్ కిల్ స్విచ్ ఆన్ చేసినప్పుడు బ్యాటరీ యాక్టివేట్ అవుతుంది. ఇంజన్ కిల్ స్విచ్‌ని ఎటువంటి కారణం లేకుండా పదేపదే నొక్కితే బ్యాటరీపై చెడు ప్రభావాన్ని చూపుతుంది ఇంకా బ్యాటరీ లైఫ్ కూడా తగ్గిస్తుంది.