Asianet News TeluguAsianet News Telugu

పండగ సీజన్ తరువాత కూడా టూ వీలర్ సేల్స్ అదుర్స్.. టాప్-5 కంపెనీల లిస్ట్ ఇదే..

ఫడా ఇచ్చిన సమాచారం ప్రకారం, నవంబర్ 2022లో మొత్తం 18 లక్షల 47 వేల 708 యూనిట్లు అమ్ముడయ్యాయి. కాగా అక్టోబర్ నెలలో మొత్తం 15 లక్షల 77 వేల 294 ద్విచక్ర వాహనాలు అమ్ముడుపోయాయి. 

Two wheelers sold fiercely in November, see the list of companies that made it to the top-5
Author
First Published Dec 9, 2022, 4:17 PM IST

ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ నవంబర్ నెలలో టూ వీలర్ల సేల్స్ గురించి సమాచారం అందించింది. దీని ప్రకారం, గత నెలలో ద్విచక్ర వాహనాల అమ్మకాలు  భారీగా జరిగాయి. విశేషమేమిటంటే, అక్టోబర్‌లో  పండుగల సీజన్‌ తర్వాత కూడా నవంబర్‌లో ద్విచక్ర వాహనాలకు డిమాండ్ స్థిరంగా కొనసాగింది.

ద్విచక్ర వాహనాల సేల్స్ ఎంతంటే 
ఫడా ఇచ్చిన సమాచారం ప్రకారం, నవంబర్ 2022లో మొత్తం 18 లక్షల 47 వేల 708 యూనిట్లు అమ్ముడయ్యాయి. కాగా అక్టోబర్ నెలలో మొత్తం 15 లక్షల 77 వేల 294 ద్విచక్ర వాహనాలు అమ్ముడుపోయాయి. ఏడాది ప్రాతిపదికన కూడా చూస్తే గతేడాది నవంబర్‌లో మొత్తం 14 లక్షల 94 వేల 797 ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నవంబర్ నెలలో ద్విచక్ర వాహనాల సేల్స్ కాస్త మెరుగ్గా ఉన్నాయి.

ఈ కంపెనీలు టాప్ ప్లేస్ లో 
సేల్స్ గణాంకాల పరంగా, హీరో మోటోకార్ప్ నవంబర్ నెలలో  అత్యధిక వాహనాలను విక్రయించింది. నవంబర్ నెలలో హీరో మోటోకార్ప్ 6,36,064 యూనిట్లను విక్రయించింది. హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ రెండవ స్థానంలో నిలిచింది. నవంబర్ నెలలో కంపెనీ 4,62,163 యూనిట్లను విక్రయించింది. TVS మోటార్ కంపెనీ హోండా తర్వాత మూడవ స్థానంలో ఉంది. నవంబర్ నెలలో  టీవీఎస్ మొత్తం 270551 యూనిట్లను విక్రయించింది.

ఇతర కంపెనీల పరిస్థితి
బజాజ్ ఆటో 2,10,251 యూనిట్ల సేల్స్ తో నాలుగో స్థానంలో ఉంది. సుజుకి మోటార్‌సైకిల్ 72,172 యూనిట్లతో, రాయల్ ఎన్‌ఫీల్డ్ 69,211 యూనిట్లతో ఐదవ స్థానంలో ఉన్నాయి.

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సేల్స్
ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్ కాకుండా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సేల్స్ కూడా పెరిగాయి. ఓలా ఎలక్ట్రిక్ నవంబర్ నెలలో మొత్తం 16,306 యూనిట్లను విక్రయించింది. ఒకినావా 9,059 యూనిట్లు, హీరో ఎలక్ట్రిక్ 9,014, అథర్ ఎనర్జీ 7,765, ఒకాయ 1,783 యూనిట్లు అమ్ముడయ్యాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios