Asianet News TeluguAsianet News Telugu

మానేసర్ ప్లాంట్ లో మళ్ళీ మొదలైన హోండా టువీలర్ ఉత్పత్తి

కాంట్రాక్టుల గడువు ముగిసిన లేదా కాంట్రాక్టు ఒప్పందం ముగిసే సమయానికి  కొంతమంది కాంట్రాక్టు కార్మికులను కంపెనీ నుండి వెళ్ళమని కోరడంతో ఈ నెల ప్రారంభంలో నిరసనలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి మనేసర్‌లోని కంపెనీ తయారీ కేంద్రంలో కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయం తిసుకుంది. 

two wheeler production started in honda manesar  plant
Author
Hyderabad, First Published Nov 26, 2019, 2:34 PM IST

హోండా మానేసర్ ప్లాంట్‌లో కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలని ఆ కంపెనీ నిర్ణయించినట్లు హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) ప్రకటించింది. కాంట్రాక్టుల గడువు ముగిసిన లేదా కాంట్రాక్టు ఒప్పందం ముగిసే సమయానికి  కొంతమంది కాంట్రాక్టు కార్మికులను కంపెనీ నుండి వెళ్ళమని కోరడంతో ఈ నెల ప్రారంభంలో నిరసనలు ప్రారంభమయ్యాయి.

అప్పటి నుంచి మనేసర్‌లోని కంపెనీ తయారీ కేంద్రంలో కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయం తిసుకుంది. హెచ్‌ఎంఎస్‌ఐ తీసుకున్న ఈ నిర్ణయం పై ఒత్తిడి చేస్తూ 2 వేలకు పైగా కార్మికులు నిరసించారు. ఇప్పుడు శాశ్వత కార్మికులందరినీ నవంబర్ 25-28 వరకు నాలుగు బ్యాచ్లలో విధుల్లోకి చేరమని కోరినట్లు హెచ్ఎంఎస్ఐ ఒక ప్రకటన విడుదల చేసింది.

also read మారుతి సుజుకి బంపర్ ఆఫర్..కార్లపై అదిరిపోయే డిస్కౌంట్

"మనేసర్ ప్లాంట్లో ఉత్పత్తిని తిరిగి ప్రారంభించే నిర్ణయం నవంబర్ 22 న తీసుకుంది. అన్ని విభాగాలల్లో శాశ్వత సిబ్బందిని నవంబర్ 25 నుండి 28 వరకు నాలుగు బ్యాచ్లలో విధుల్లోకి చేరాలని సమాచారం ఇచ్చింది. షెడ్యూల్ ప్రకారం తిరిగి పనిలో చేరే ప్రక్రియ ప్రారంభమైంది.

" మేము సాధారణ స్థితి కోసం ఎదురుచూస్తున్నాము పారిశ్రామిక శాంతిని కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతో శాశ్వత కార్మికులందరూ షెడ్యూల్ ప్రకారం పనిని తిరిగి ప్రారంభించాలని అలాగే క్రమశిక్షణ, మంచి విశ్వాసం, సహకారం మరియు సానుకూలతతో వారికి కేటాయించిన విధులను నిర్వర్తించాలని భావిస్తున్నామని" మనేసర్ ప్లాంట్ మేనేజ్‌మెంట్, హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) అధికారిక ప్రకటనలో తెలిపింది.

also read 2,458cc గల కొత్త బైక్ లాంచ్ చేయనున్న ట్రంఫ్ మోటార్ సైకిల్స్

కొంతమంది కాంట్రాక్టు ఉద్యోగుల ఒప్పందం ముగియడంతో ప్లాంట్‌లోకి  వారిని అనుమతించకపోవడంతో నవంబర్ 5 న నిరసనలు ప్రారంభమయ్యాయి. హెచ్‌ఎంఎస్‌ఐ  మనేసర్ ప్లాంటులో 1,900 మంది శాశ్వత కార్మికులు, 2,500 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. ఉద్యోగుల సంఘం ప్రకారం, హెచ్‌ఎంఎస్‌ఐ ఈ ప్లాంట్ ఉత్పత్తిని 50 శాతం తగ్గించి, కాంట్రాక్టు కార్మికులను తొలగించింది.

గత 11 నెలలుగా ఆటో పరిశ్రమలో మందగమనం ఉండటంతో ప్లాంట్‌లో ఉత్పత్తిని మరియు కాంట్రాక్ట్ కార్మికులను తీసివేయడానికి దారితీసిందని హెచ్‌ఎంఎస్‌ఐ పేర్కొంది. HMSI ప్రకారం, కాంట్రాక్టు కార్మికులు పదవీకాలం పూర్తయిన తరువాత వారిని విధుల నుండి తేసివేయడం జరిగింది, కాని శాశ్వత కార్మికుల పై ఇది ఎలాంటి ప్రభావం చూపలేదు.
 

Follow Us:
Download App:
  • android
  • ios