మారుతి సుజుకి బంపర్ ఆఫర్..కార్లపై అదిరిపోయే డిస్కౌంట్
పండుగల సీజన్ సందర్భంగా సేల్స్‌లో పతనాన్ని బ్రేక్ చేసిన ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తాజాగా తన విక్రయాలను పెంచుకోవడానికి వివిధ రకాల మోడల్ కార్లపై రూ.1.13 లక్షల వరకు రాయితీలు అందిస్తోంది. ఈ ఆఫర్ ఈ నెల 30 వరకు మాత్రమే
న్యూఢిల్లీ: ఎట్టకేలకు దేశంలోనే అతిపెద్ద ప్రయాణికుల తయారీ సంస్థ మారుతి సుజుకి ఫెస్టివ్ సీజన్‌తో విక్రయాల్లో పతనానికి బ్రేక్ వేసిన ఉత్సాహంతో మరింత ముందుకు దూసుకెళ్తోంది. ఎనిమిది నెలల వరుస పతనాల తర్వాత అక్టోబర్ సేల్స్‌లో 4.5 శాతం పురోగతి సాధించిన మారుతి సుజుకి తాజాగా తన ఫేవరెట్ కార్లపై వినియోగదారులకు అందుబాటులోకి తెస్తోంది. పండుగల సందర్భంగా కొనుగోలు చేయలేకపోయిన వారి కోసం మారుతి సుజుకి ఈ శుభవార్తను తీసుకొచ్చింది.
మారుతి తన డీలర్‌షిప్‌ల ద్వారా భారీ రాయితీలు అందిస్తుంది. మారుతి బాలెనో, సియాజ్, ఇగ్నిస్, ఎస్ క్రాస్ మోడల్ కార్లపై రూ.1.13 లక్షలకు రాయితీ ఇస్తోంది. ఈ నెల 30వ తేదీ వరకు ఈ ఆఫర్లు లభిస్తాయి. వాటిని పరిశీలిద్దాం..
also read 2,458cc గల కొత్త బైక్ లాంచ్ చేయనున్న ట్రంఫ్ మోటార్ సైకిల్స్
పెట్రోల్ వేరియంట్ బాలెనోపై ఇలా
మారుతి సుజుకి బాలెనో పెట్రోల్ వేరియంట్ కారుపై రూ.35 వేల వరకు బెనిఫిట్లు లభిస్తున్నాయి. కస్టమర్ ఆఫర్ కింద రూ.15,000, ఎక్స్చేంజ్ ఆఫర్ రూపంలో మరో రూ.15,000, కార్పొరేట్ రాయితీ కింద రూ.5000 అందిస్తోంది.
బాలెనో డీజిల్ వేరియంట్ కారుపై రూ.62,400 వరకు బెనిఫిట్
మారుతి సుజుకి డీజిల్ ట్రిమ్ బాలెనో మోడల్ కారుపై రూ.62,400 ఆఫర్ లభిస్తున్నది. ఈ ప్రీమియర్ హ్యాచ్ బ్యాక్ కారు కొనుగోలు దారులకు కస్టమర్ ఆఫర్ కింద రూ.20 వేలు, ఎక్స్చేంజ్ రాయితీ రూపంలో రూ.15 వేలు, కార్పొరేట్ ఆఫర్‌గా రూ.10 వేలతోపాటు ఐదేళ్ల పాటు వారంటీ అందజేస్తోంది.
సియాజ్ పెట్రోల్ వేరియంట్‌పై రూ.65 వేల రాయితీలు
మారుతి సుజుకి సియాజ్ పెట్రోల్ ట్రిమ్ కారు కొనుగోలు చేస్తే రూ.65 వేల వరకు రాయితీ పొందొచ్చు. కన్జూమర్ ఆఫర్ రూపంలో రూ.25 వేలు, ఎక్స్చేంజ్ ఆఫర్‌గా రూ.30 వేలు, కార్పొరేట్ ఆఫర్‌గా రూ.10 వేలు రాయితీ లభిస్తుంది.
సియాజ్ డీజిల్ ట్రింపై రూ.87 వేల వరకు ఆఫర్
మారుతి సుజుకి సియాజ్ పెట్రోల్ ట్రిమ్ కారు కొనుగోలు చేసే రూ.87,700 వరకు ఆపర్ లభిస్తోంది. కన్జూమర్ ఆఫర్ రూపంలో రూ.25 వేలు, ఎక్స్చేంజ్ ఆఫర్‌గా రూ.30 వేలు, కార్పొరేట్ ఆఫర్‌గా రూ.10 వేలు రాయితీ లభిస్తుంది. వీటితోపాటు ఐదేళ్ల వారంటీ అందిస్తోంది.
also read కార్లంటే ఇష్టపడే వారి కోసం మెర్సిడెజ్ నుంచి లగ్జరీ మోడల్ కారు...
ఇగ్నిస్ పెట్రోల్ వేరియంట్ కారుపై రూ.52 వేల రాయితీ
మారుతి సుజుకి రూపొందించిన మినీ ఎస్‌యూవీ మోడల్ కారు ఇగ్నిస్. ఈ మోడల్ పెట్రోల్ వర్షన్ కారుపై రూ.52 వేల వరకు రాయితీలు పొందొచ్చు. ఇందులో కన్జూమర్ డిస్కౌంట్ రూ.25 వేలు, ఎక్స్చేంజ్ ఆఫర్ రూ.20 వేలు, కార్పొరేట్ ఆఫర్‌గా రూ.7,000 పొందొచ్చు.
ఎస్-క్రాస్ డీజిల్ ట్రింపై రూ.1.13 లక్షల ఆఫర్లు
డీజిల్ వేరియంట్‌లోనే వినియోగదారుల ముంగిట్లోకి వచ్చిన ఎస్ -క్రాస్ మోడల్ కారుపై మారుతి సుజుకి బంపర్ ఆఫర్లు అందిస్తోంది. ఎకాఎకీన రూ.1.13 లక్షల వరకు వివిధ రూపాల్లో ఆఫర్లు అందిస్తున్నది. కన్జూమర్ ఆఫర్ కింద రూ.50 వేలు, ఎక్స్చేంజ్ ఆఫర్ రూపంలో రూ.30 వేలు, కార్పొరేట్ ఆఫర్‌గా రూ.10 వేలతోపాటు ఐదేళ్ల ఉచితంగా వారంటీ అందిస్తోంది.