ఎలక్ట్రికల్ ౩ వీలర్  ప్యాసింజర్ ఆటో వాహనాలను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లాంఛనంగా నేడు ప్రారంభించారు.

పియాగో వేహికిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (పి‌వి‌పి‌ఎల్) తయారు చేసిన ఎలక్ట్రికల్ ౩ వీలర్ ప్యాసింజర్ ఆటో వాహనాలను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు.

మంగళవారం ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ ప్యాసింజర్ ఆటోను నడిపి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఆటో రంగాలలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా అన్ని రంగాల ప్రజలకు అందుబాటులో ఉండే ఆటోలను తయారు చేసిన సంస్థను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభినందించారు.