Asianet News TeluguAsianet News Telugu

ట్రాఫిక్ రూల్స్: చెప్పులు, హాఫ్ షర్ట్, టీ-షర్ట్ లేదా లుంగీ ధరించి డ్రైవింగ్ చేస్తే చలాన్ వేస్తారా.. ?

మోటారు వాహన చట్టంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త సవరణలు చేస్తున్నారు. అయితే రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ఇంకా మీ ప్రయాణం సురక్షితంగా ఉండటానికి ఈ నియమాలను తీసుకువస్తున్నారు. చాలా సార్లు ట్రాఫిక్ నిబంధనలపై పుకార్లు కూడా వస్తుంటాయి. వీటి గురించి చాలా మంది గందరగోళానికి గురవుతుంటారు.
 

Traffic Rules: Know whether challan issues for driving with wearing slippers, half shirt, T-shirt or lungi-sak
Author
First Published Apr 26, 2023, 5:44 PM IST

నేటికీ భారతదేశంలో చాలా మందికి ట్రాఫిక్ నియమాలు తెలియవు లేదా ఒకోసారి తెలియకుండా వాటిని ఉల్లంఘిస్తుంటారు. అయితే ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు కూడా చాలా స్ట్రిక్ట్ గా మారి ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వారిపై నేరుగా చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ నిబంధనల గురించి గందరగోళ పడటం, రూమర్‌లను రూల్స్ భావించే వారు చాలా మంది ఉన్నారు.

అయితే సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది, అందులో హాఫ్ స్లీవ్ షర్ట్, లుంగీ లేదా చెప్పులు ధరించి డ్రైవింగ్ చేస్తే మీ చలాన్‌ విధించవచ్చు. అంతే కాదు కారు అద్దాలు మురికిగా ఉన్నా, కార్ లేదా బైక్ కి ఎక్స్ ట్రా  లైట్ పెట్టకున్నా జరిమానా పడుతుందని  ఫెక్  ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో దీనిపై చాలా స్పందనలు వచ్చాయి, అయితే ఇందులో మీకు నిజం ఏంటో తెలుసా.. ముందుగా ట్రాఫిక్ నియమాలు ఏమిటి,  చలాన్ ఎప్పుడు జారీ చేస్తారో తెలుసుకోండి…

హాఫ్ షర్ట్, టీ షర్ట్, లుంగీ ధరించి డ్రైవ్ చేయడం నేరమా..?

సవరించిన మోటారు వాహనాల చట్టం (2019) గురించి మాట్లాడితే  దాని ప్రకారం, హాఫ్ షర్ట్ లేదా లుంగీ ధరించి వాహనం నడపడం నేరం కాదు, దానిపై ఎటువంటి చలాన్ లేదా జరిమానా విధించబడదు. కార్ లేదా బైక్ కి అదనపు బల్బు పెట్టుకున్నందుకు లేదా కారు విండ్‌షీల్డ్ మురికిగా ఉన్నందుకు జరిమానా విధించడం వంటి నియమం ఈ చట్టంలో లేదు. అంటే మీరు మీకు నచ్చిన హాఫ్ షర్ట్, టీ-షర్ట్ లేదా లుంగీ ధరించి డ్రైవ్ చేయవచ్చు. ట్రాఫిక్ పోలీసులు దీని పై ఏదైనా జరిమానా విధిస్తే అది చట్టవిరుద్ధం ఇంకా మీరు దాని గురించి ఫిర్యాదు చేయవచ్చు.

ట్రాఫిక్ పోలీసులు ఎవరినైనా మిమ్మల్ని ఆపివేసినప్పుడు కారు లేదా బైక్ తాళం బలవంతంగా తీసుకోవడం లేదా టైర్‌ గాలి తీయడం చాలా సార్లు జరుగుతుంది. అయితే ట్రాఫిక్ పోలీసులకు అలాంటి అధికారం లేదు. అలా చేయడం చట్టరీత్యా నేరం. మోటారు వాహనాల చట్టం ప్రకారం మీ వాహనాన్ని సీజ్ చేసే హక్కు కూడా ట్రాఫిక్ పోలీసులకు లేదు. మీరు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్లయితే, ASI స్థాయి పోలీసు అధికారి మాత్రమే చలాన్‌ విధించవచ్చు. ఏఎస్‌ఐ, ఎస్‌ఐ, ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారులు జరిమానాలు విధించవచ్చని మోటార్ వెహికల్ యాక్ట్ 1988 స్పష్టంగా పేర్కొంది.

Follow Us:
Download App:
  • android
  • ios