న్యూఢిల్లీ: భూతాపాన్ని తగ్గించేందుకు ప్రపంచ వ్యాప్తంగా భారీ యుద్ధమే సాగుతోంది. ఈ బాటలోనే భారతదేశం కూడా ప్రపంచ దేశాలతో తన వంతుగా పోరాడుతోంది. ఈ క్రమంలో భారతదేశానికి ఒక సానుకూల సంస్థ రంగ ప్రవేశించింది. జపాన్‌కు చెందిన అంతర్జాతీయ కార్ల తయారీ సంస్థ ‘టయోటా కిర్లోస్కర్’ తన వంతుగా ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ‘పర్యావరణ హితమైన’ ప్లాంట్ భారతదేశంలోని ఏర్పాటు చేయనున్నది. బెంగళూరు - మైసూర్ మధ్య చిన్న పారిశ్రామిక పట్టణం బిదాడీలో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని టయోటా కిర్లోస్కర్ సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. భారత్ సాఫ్ట్‌వేర్ హబ్ ‘బెంగళూరు’కు సమీపంలోనే ఈ ప్లాంట్ ఏర్పాటు కానున్నది. ప్రపంచవ్యాప్తంగా 56 పర్యావరణ హితమైన ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నది. 

ఈ ప్లాంట్ నిర్వహణకు ఏడాదికి 83 మిలియన్ల యూనిట్ల విద్యుత్ అవసరం. అందులో 68 శాతం అంటే 56 మిలియన్ల యూనిట్ల విద్యుత్‌ను సంప్రదాయేతర వనరులైన సౌర విద్యుత్, పవన్ విద్యుత్ ద్వారా సమకూర్చుకోవాలని తలపోస్తున్నది. ఇంత మొత్తం విద్యుత్‌ను కూడా సొంతంగా ప్లాంట్ లోపల గానీ, బయట నుంచి గానీ కొనుగోలు చేసేందుకు ప్రణాళికలూ రూపొందించుకున్నది. 

అంతేకాదు నార్త్నన్ ఫ్రాన్స్‌లో ఏర్పాటు చేయనున్న రెండో పర్యావరణ హితమైన ప్లాంట్ కు అవసరమైన విద్యుత్‌లో 35 శాతాన్ని సంప్రదాయేతర పర్యావరణ హిత మార్గాల్లో సమకూర్చుకోవాలన్నది ప్లాన్. పర్యావరణ పరిరక్షణ కోసం, భూతాప నివారణ కోసం భారీగా ప్రచారం చేస్తున్న దేశాల్లో ఫ్రాన్స్ ముందు వరుసలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా పర్యావరణానికి నష్టం చేస్తున్న దేశాల్లో భారత్, చైనా మొదటి వరుసలో ఉన్నాయి. 

ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా 2030 నాటికి భూతాప పరిరక్షణ కోసం 40 శాతం శిలాజేతర ఇంధన వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అవసరమైన ప్లాంట్లు ఉత్పత్తి చేయాలని  లక్ష్యాన్ని నిర్దేశించారు. బిదాడీ ఫ్యాక్టరీ కూడా అంతర్జాతీయంగా పర్యావరణ హితమైన ప్లాంట్ల నిర్మాణానికి మోడల్ కానున్నది. టయోటా కిర్లోస్కర్ మోటార్స్ ప్రొడక్ట్ డిజైన్ అండ్ డెవలప్‪మెంట్ విభాగం డైరెక్టర్, ఉపాధ్యక్షుడు రాజు బీ కేట్కాలే మీడియాతో మాట్లాడుతూ ఇతర కార్లు, మోటార్ సైకిళ్ల తయారీ సంస్థలు కూడా ఇదే బాటలో ప్రయాణించాలని సంప్రదాయేతర ఇంధన వనరులను ఉపయోగించుకోవాలని కోరారు. 

2020 నాటికి అదనంగా ఏడు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్షంగా పెట్టుకున్నది టయోటా కిర్లోస్కర్. ఇది సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తిలో 80 శాతంగా ఉంటుందని టయోటా కిర్లోస్కర్ మోటార్స్ ప్రొడక్ట్ డిజైన్ అండ్ డెవలప్‪మెంట్ విభాగం డైరెక్టర్, ఉపాధ్యక్షుడు రాజు బీ కేట్కాలే చెప్పారు. 2035 నాటికి కర్బన ఉద్గారాలు లేకుండా చేయాలన్నది తమ లక్ష్యమైతే 2025 నాటికే చేరుకోవాలని లక్ష్యం చేసుకున్నామని కేట్కాలే తెలిపారు. గత ఏడాది కాలంలో ఇంధన వ్యయాన్ని 20 శాతం తగ్గించుకుని లబ్ధి పొందింది టయోటా కిర్లోస్కర్. సంప్రదాయ విద్యుత్ వినియోగానికి బదులు సౌర విద్యుత్‌ను వినియోగంలోకి తీసుకొచ్చింది.

సౌర విద్యుత్ ఉత్పత్తి కోసం టయోటా కిర్లోస్కర్.. గుర్గావ్ కేంద్రంగా పని చేస్తున్న రెన్యూ పవర్ వెంచర్స్ లిమిటెడ్ సంస్థ భాగస్వామ్యంలో సౌర విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు నిర్దేశిత సామర్థ్యం కన్నా 25 శాతం అధికంగా ఉత్పత్తి చేయనున్నాయి. వినియోగించగా మిగిలిన విద్యుత్‌ను స్థానిక ప్రభుత్వానికి విక్రయిస్తాయి. కర్ణాటకలోని మూడు సౌర విద్యుత్ కేంద్రాలు రోజుకు 18 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. సంస్థ అవసరాల కోసం ఇతర వనరుల్లో జలం కొనుగోలును కనీసస్థాయికి కనిష్టస్థాయికి తేవడానికి టయోటా ప్రణాళికలు అమలు చేస్తోంది.2014లో వర్షపు నీటిని వడిసిపట్టి తన నీటి అవసరాల్లో 65 శాతం రీ సైక్లింగ్ ద్వారా తయారు చేసింది. 2020 నాటికి నీటి వినియోగంలోనూ మిగులు సాధించాలని లక్ష్యంగా ముందుకు సాగుతోంది టయోటా కిర్లోస్కర్. చౌక ధరకు సౌర విద్యుత్ ఉత్పత్తి ఆకర్షణీయ ప్రతిపాదన అని చెబుతున్నారు. కన్సల్టింగ్ సంస్థ కేఎంపీజీ ఇండియా పార్టనర్ సంతోష్ కామత్ మాట్లాడుతూ ఉత్పత్తి చేస్తున్న సౌర విద్యుత్‌ను యూనిట్‌ ఉత్పత్తి వ్యయం రూ.3 తగ్గించారని తెలిపారు.