టొయోటా ఇన్నోవా క్రిస్టా, ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ వాహనాల రీకాల్
ప్రముఖ కార్ల తయారీ కంపనీ టొయోటా కిర్లోస్కర్ మోటార్స్(టీకెయం) ఇండియా తమ సంస్థకు చెందిన రెండు ప్రముఖ మోడళ్లను రీకాల్ చేసింది. తమ సంస్థ నుండి వెలువడిన ఈ వాహనాల్లో తలెత్తిన సాంకేతిక సమస్యను పరిష్కరించడానికే ఈ రీకాల్ ప్రకటన చేసినట్లు టొయోటా ప్రకటించింది.

జపాన్ కంపనీ టొయోటా సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో అన్ని సంస్థల కంటే ముందు వరుసలో ఉంటుంది. ఈ సంస్థ నుండి విడుదలైన ఇన్నోవా క్రిస్టా, పార్చ్యూనర్ వాహనాలకు వినియోగదారుల నుండి మంచి ఆధరణ లభించింది. దీంతో టోయోటా రేంజ్ను మార్కెట్ లో మరింత బలపడింది. మల్టీపర్పస్ పర్పస్ వాహనాల అమ్మకాల్లో మిగతా కంపనీల వాహనాలను వెనక్కి నెట్టి ఈ రెండు మోడళ్లు ముందు వరుసలో ఉన్నాయి.
అయితే జూలై 18వ తుదీ నుండి మార్చి 22 తేదీ వరకు తయారయిన టొయోటా ఇన్నోవా క్రిస్టా, ఫార్చ్యూనర్ వాహనాలను సంస్థ రికాల్ చేసింది. ఈ మధ్య కాలంలో తయారయిన దాదాపు 2,628 వాహనాల ఇంధన ట్యాంకుల్లో సాంకేతిక సమస్యను గుర్తించే ఈ రీకాల్ ప్రకటన చేసినట్లు సంస్థ తెలిపింది. ఈ వాహనాలను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించి, సమస్యలుంటే పరిష్కరించి వినియోగదారులకు అందించనున్నట్లు తెలిపింది.
వినియోగదారుల సంరక్షణతో పాటు వారికి సంతృప్తికరమైన సేవలు అందించడానికి టోయోటా ఎప్పుడూ ప్రయత్నిస్తుందని,అందువల్లే ఇలా రీకాల్ ప్రకటన చేసినట్లు తెలిపింది. తాము తెలిపిన తేధీల మధ్య తయారయిన వాహనాలు వాడుతున్న వారు తమ డీలర్లను సంప్రదించి రీకాల్ కి సంబంధించిన మరింత సమాచారాన్ని పొందవచ్చని టొయోటా సంస్థ తన ప్రకటనలో తెలిపింది.