SHEV:టయోటా కిర్లోస్కర్ మోటార్ 'హమ్ హై హైబ్రిడ్' క్యాంపైన్.. వెబ్ వీడియో ద్వారా నేడు ప్రారంభం..
భారతదేశంలోని ప్రముఖ వాహన తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్ (Toyota Kirloskar Motor) ఇండియాలో "హమ్ హై హైబ్రిడ్" అనే క్యాంపైన్ ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.
దేశంలోని ప్రముఖ వాహన తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్ (Toyota Kirloskar Motor) 2050 నాటికి 'కార్బన్ న్యూట్రాలిటీ'ని అమలు చేసేందుకు గట్టిగా కట్టుబడి ఉన్నట్టు ప్రకటించింది. అలాగే దేశంలోని కార్బన్ ఉద్గారాలను తగ్గించడం, శిలాజ ఇంధనంపై ఆధారపడటాన్ని తగ్గించడం వంటి కీలక జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా కంపెనీ ముందుకు సాగుతుంది. దీనితో పాటు టయోటా దేశంలో "హమ్ హై హైబ్రిడ్" అనే క్యాంపైన్ ప్రారంభించినట్లు ప్రకటించింది.
"మా భాగస్వామ్యాం 2015 ప్రారంభంలో ప్రారంభమైంది, టయోటా ప్రపంచవ్యాప్తంగా ఆరు థీమ్‌ల పర్యావరణ సవాలును స్వీకరించింది, వీటిలో మూడు వాహనాల నుండి జీరో కార్బన్ ఉద్గారాల వైపు ఉన్నాయి. ఎలక్ట్రిఫైడ్ వాహనాలు ఎక్కువగా నడపబడుతున్నాయి," అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అడాప్షన్ దిశగా టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) ఈరోజు ప్రత్యేకంగా నిర్వహించిన వెబ్ వీడియో సిరీస్ ద్వారా "హమ్ హై హైబ్రిడ్" పేరుతో ఒక క్యాంపైన్ ప్రారంభించినట్లు ప్రకటించింది, ఇది సెల్ఫ్-చార్జింగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాల (SHEVs) మొత్తం ప్రయోజనాలను అన్వేషిస్తుంది.
గ్రీన్ మొబిలిటీపై ఈ డిజిటల్ క్యాంపైన్ - 'సెల్ఫ్ ఛార్జింగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్', TKM దేశవ్యాప్తంగా 'మాస్ ఎలక్ట్రిఫికేషన్' వైపు వేగంగా మారడానికి ప్రయత్నిస్తుంది. అయితే టయోటా డిజిటల్ ప్రమోషన్ విధానంలో భాగంగా రూపొందించి, అభివృద్ధి చేయబడింది, "హమ్ హై హైబ్రిడ్" క్యాంపైన్ SHEV గురించి అవగాహనను బలోపేతం చేయడానికి డిజైన్ చేయబడింది.