వేల కోట్ల నష్టం: నీటిలో మునిగిపోయిన పోర్షే, బెంట్లీ, లంబోర్ఘిని, ఫోక్స్‌వ్యాగన్‌ వంటి లగ్జరీ కార్లు..

650 అడుగుల పొడవున్న ఈ కార్గో షిప్ 4,000 కార్లను మోసుకెళ్లగలదు. అయితే కార్గో షిప్ లో ఎన్ని కార్లు ఉన్నాయనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. 

Thousands of cars including Audis, Porsches adrift on burning cargo ship

 జర్మనీ నుంచి అమెరికాకు లగ్జరీ కార్లతో వెళుతున్న భారీ కార్గో షిప్ (cargo ship)మంగళవారం అట్లాంటిక్ సముద్రంలో మునిగిపోయింది. ఈ సమాచారాన్ని పోర్చుగీస్ నేవీ అధికారులు తెలిపారు. అయితే రెండు వారాల క్రితం ఈ కార్గో షిప్ లో మంటలు చెలరేగాయి. కార్గో షిప్ పేరు 'ఫెలిసిటీ ఏస్'(Felicity Ace) స్థిరత్వాన్ని కోల్పోయిందని అలాగే ఒడ్డుకు లాగుతున్నప్పుడు పోర్చుగల్‌లోని అజోర్స్ దీవుల(Azores islands)కు 250 మైళ్ల దూరంలో మునిగిపోయిందని అధికారులు ధృవీకరించారు. 

కార్గో షిప్ మునిగిన చోట కొన్ని శిథిలాలు, కొద్దిపాటి చమురు మాత్రమే కనిపించాయని, టగ్‌బోట్లు గొట్టాల నుండి చమురు పాచెస్‌ను విడదీస్తున్నాయని పోర్చుగీస్ నేవీ ఒక ప్రకటనలో తెలిపింది. ఫెలిసిటీ ఏస్‌ను పర్యవేక్షిస్తున్న ఓడల్లో ఒకటి కాలుష్య నియంత్రణ పరికరాలను సేకరించేందుకు అజోర్స్‌లోని పొంటా డెల్గడకు వెళుతున్నట్లు పోర్చుగీస్ నేవీ అధికారులు తెలిపారు.

650 అడుగుల పొడవున్న ఈ కార్గో షిప్ 4,000 కార్లను మోసుకెళ్లగలదు. అయితే కార్గో షిప్ లో ఎన్ని కార్లు ఉన్నాయనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. మీడియా నివేదికల ప్రకారం, కార్గో షిప్ లో ఎన్ని కార్లు ఉన్నాయి, అవి ఏ మోడల్స్ అనే దాని గురించి స్పందించడానికి యూరోపియన్ వాహన తయారీదారులు నిరాకరించారు. అయితే,  యూ‌ఎస్ లోని పోర్షే కస్టమర్‌లను వారి డీలర్‌షిప్‌లు వ్యక్తిగతంగా సంప్రదిస్తున్నాయి.

"ఈ సంఘటనతో ప్రభావితమైన ప్రతి కారును భర్తీ చేయడానికి మేము కృషి చేస్తున్నాము అలాగే త్వరలో కొత్త కార్లు నిర్మించబడతాయి" అని పోర్షే కార్స్ నార్త్ అమెరికా ఇంక్. పబ్లిక్ రిలేషన్స్ వైస్ ప్రెసిడెంట్ అంగస్ ఫిట్టన్ మీడియాతో అన్నారు. 

పోర్చుగీస్ నౌకాదళం కార్గో షిప్ లో మొత్తం 22 మంది సిబ్బందిని రక్షించింది. అయితే ఈ కార్గో షిప్ ఫిబ్రవరి 16న డేవిస్‌విల్లేకి చేరుకోవాల్సి ఉంది. సిబ్బందిని హెలికాప్టర్‌లో అజోర్స్‌లోని ఫయల్ ఐలాండ్ కి తరలించారు. మరివైపు కార్గో షిప్ సిబ్బందిలో ఎవరూ గాయపడలేదు. 

కోట్ల నష్టం 
నివేదిక ప్రకారం వోక్స్‌వ్యాగన్  వాహనాలకు కనీసం 155 మిలియన్ డాలర్లు (రూ. 1100 కోట్లు) నష్టపరిహారాన్ని బీమా కంపెనీ కవర్ చేసిందని ధృవీకరించింది. పోర్షే, బెంట్లీ, లంబోర్ఘిని, వోక్స్‌వ్యాగన్‌ల కార్లను కలుపుకుని మొత్తం కార్గో అంచనా నష్టం దాదాపు 440 మిలియన్ డాలర్లు (రూ. 3300 కోట్లు) అని నివేదిక పేర్కొంది.

వోక్స్‌వ్యాగన్  గ్రూప్ సముద్రంలో వాహనాలను పోగొట్టుకోవడం ఇదేం మొదటిసారి కాదు. 2019 గ్రాండే అమెరికాలో మంటలు చెలరేగి మునిగిపోయినప్పుడు ఆడిస్, పోర్షెస్‌తో సహా 2,000 కంటే ఎక్కువ లగ్జరీ కార్లు నీటిలో మునిగిపోయాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios