గంటకు 250 కి.మీ స్పీడ్ తో దూసుకుపోయే సరికొత్త ఎస్‌యూవీ.. దీని ధర, ఫీచర్స్ అదిరిపోయాయి..
బిఎండబ్ల్యూ X3 M340i SUV 3.0-లీటర్ 6-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 360 హెచ్‌పి పవర్, 500 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ 4-వీల్ డ్రైవ్ SUVకి 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అందించారు.
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బిఎండబ్ల్యూ కొత్త ఎక్స్3 ఎం340i ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.86.5 లక్షలు. కంపెనీ ఈ SUV కోసం గత నెలలో బుకింగ్స్ ప్రారంభించింది. బుకింగ్ మొత్తాన్ని రూ.5 లక్షలుగా నిర్ణయించారు. ఈ BMW SUV లిమిటెడ్ సంఖ్యలో అందుబాటులో ఉంటాయి. X3 M40i అనేది కంపెనీ X3 SUV పర్ఫార్మెన్స్ వెర్షన్.
బిఎండబ్ల్యూ X3 M340i SUV 3.0-లీటర్ 6-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 360 హెచ్‌పి పవర్, 500 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ 4-వీల్ డ్రైవ్ SUVకి 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అందించారు. X3 M340i కేవలం 4.9 సెకన్లలో 0 నుండి 100 kmph వరకు స్పీడ్ అందుకోగలదని BMW పేర్కొంది. ఈ SUV టాప్ స్పీడ్ గంటకు 250 kmph. కంఫర్ట్, ఎకో ప్రో, స్పోర్ట్ ఇంకా స్పోర్ట్ ప్లస్ వంటి రైడింగ్ మోడ్‌లతో కంపెనీ దీనిని తీసుకొచ్చింది.
BMW X3 M340iకి మ్యాట్రిక్స్ ఫంక్షన్, LED హెడ్‌లైట్లు, 20-అంగుళాల అల్లాయ్ వీల్స్, LED టెయిల్‌లైట్లు వంటి ఎన్నో ప్రత్యేకమైన ఎక్స్టెర్నల్ ఫీచర్స్ ఉన్నాయి. X3 M340i కార్బన్ ఫైబర్ ట్రిమ్ ఫినిషింగ్‌తో బ్లాక్ ఇంటీరియర్‌ను పొందుతుంది.
BMW SU, iDrive 7 ఆపరేటింగ్ సిస్టమ్‌తో 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్, ట్రిపుల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, గెస్చర్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా, యాంబియంట్ లైటింగ్, 464W హర్మాన్ స్పీకర్, 16- స్పీకర్ సౌండ్ సిస్టమ్, హెడ్ అప్ డిస్‌ప్లే, బ్రేకింగ్‌తో కూడిన స్టీరింగ్ వీల్, పెడల్ షిఫ్టర్లు, క్రూయిజ్ కంట్రోల్, ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్, ఆటోమేటిక్ డిఫరెన్షియల్ బ్రేక్‌తో పాటు 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్, ABS ఇంకా ఎన్నో ఇతర సెఫ్ట్య్ ఫీచర్లు అందించారు.
X3 M340i పోటీగా ఉండే కార్ల విషయానికి వస్తే, ఈ మోడల్‌కు ప్రత్యక్ష పోటీ లేదు. కానీ దాని పనితీరు పరంగా పోర్స్చే మకాన్ S ఉంది. ఈ కారు 2.9-లీటర్, ట్విన్-టర్బోచార్జ్డ్ V6 ఇంజన్, 380hp ఇంకా 520Nm ఉత్పత్తి చేస్తుంది. Macan S 4.7 సెకన్లలో 0-100kph స్పీడ్ అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 259km. ఈ పోర్షే కారు ధర రూ.1.43 కోట్లు అంటే బీఎండబ్ల్యూ కంటే రూ.56.50 లక్షలు ఎక్కువ.