రాయల్ ఎన్‌ఫీల్డ్‌కి గట్టి పోటీగా బ్రిటిష్ కంపెనీ సూపర్ బైక్ వచ్చేస్తోంది.. దీని ఫీచర్స్, ధర, బైక్ పేరు ఏంటంటే

భారత మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు బీఎస్‌ఏ కంపెనీ సిద్ధమవుతోంది. ఈ కంపెనీ భారత్‌కు వచ్చిన తర్వాత రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు గట్టి సవాలు ఎదురుకానుంది.
 

This powerful bike BSA Gold Star is coming to challenge Royal Enfield, know its features and price-sak

రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు సవాలు విసిరేందుకు త్వరలో భారత మార్కెట్లోకి ఒక కొత్త కంపెనీ ఎంట్రీ ఇవ్వబోతుంది. అయితే  ఇండియన్ మార్కెట్లోకి ఏ కంపెనీ రావచ్చు, ఈ బైక్ ఎలా ఉండబోతుంది, వీటి ధర ఇంకా ఫీచర్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం...

మీడియా కథనాల ప్రకారం, భారతదేశంలో రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు బ్రిటిష్ కంపెనీ గట్టి ఛాలెంజ్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. అది ఏ కంపెనీ, ఎప్పుడు ఇండియాకు రావచ్చు, బైక్‌ను ఎంత ధరకు విడుదల చేయవచ్చో  చూద్దాం..

రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు పోటీగా 
భారత మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు బీఎస్‌ఏ కంపెనీ సిద్ధమవుతోంది. ఈ కంపెనీ భారత్‌కు వచ్చిన తర్వాత రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు గట్టి సవాలు ఎదురుకానుంది.

ఏ బైక్ లాంచ్ అవుతుంది
మొదట కంపెనీ గోల్డ్ స్టార్ బైక్‌ను మార్కెట్లోకి విడుదల చేయవచ్చు. ఈ బైక్‌ను 650 సీసీ సెగ్మెంట్‌లో విడుదల చేయనుంది. ఈ కారణంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ GT, సూపర్ మెటోర్ వంటి బైక్‌లకు  గట్టి పోటీగా నిలుస్తుంది.

ఫీచర్స్ ఏంటి 
 ఈ బైక్ ఇంజిన్  సింగిల్ సిలిండర్ ఫోర్ వాల్వ్‌తో రావచ్చు. ఈ ఇంజన్‌తో బైక్ 44 బిహెచ్‌పి, 55 న్యూటన్ మీటర్ల టార్క్‌ను పొందుతుంది. ఈ బైక్ కి 12 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది, దీని బరువు దాదాపు 213 కిలోలు. ABS, సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, టెలిస్కోపిక్ ఫోర్క్స్ వంటి ఎన్నో ఫీచర్లను ఈ బైక్‌లో చూడవచ్చు.

ఎంత ఖర్చు అవుతుందంటే
అయితే ఈ ఏడాదిలో కంపెనీ భారత్‌లో  ఎంట్రీని రిజిస్టర్ చేసుకోవచ్చని భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో భారతదేశంలో ఈ బైక్ అంచనా ధర సుమారు 3.30 లక్షల రూపాయలు ఉండొచ్చు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios