మారుతి సుజుకి లేటెస్ట్ సన్‌రూఫ్ ఎస్‌యూవి.. ఆకట్టుకునే ఫీచర్స్ తో అదరగొడుతున్న బుకింగ్స్..
నివేదికల ప్రకారం మారుతి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ కొత్త మారుతి బ్రెజ్జా కోసం కంపెనీ ఇప్పటివరకు లక్షా ఆరు వేలకు పైగా బుకింగ్‌లను పొందిందని, గత నెలలో కంపెనీ మొత్తం 15,193 బ్రెజ్జా కార్లను కస్టమర్లను డెలివరీ చేసిందని చెప్పారు.
ఆటోమోబైల్ తయారీ సంస్థ మారుతి సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవి బ్రెజ్జాని గత నెల జూన్ లో లాంచ్ చేసిన సంగతి మీకు తెలిసిందే. అయితే ఈ కారు లాంచ్ నుండి కంపెనీకి బంపర్ బుకింగ్స్ వచ్చాయి. మీడియా నివేదికల ప్రకారం, ఈ కారు కోసం లక్షకు పైగా బుకింగ్‌లు లభించాయి. మరోవైపు ఆగస్ట్ నెలలో మొత్తం 15,193 కార్ల సేల్స్ తో ఇండియాలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీగా అవతరించింది.
బ్రెజ్జా బుకింగ్స్
నివేదికల ప్రకారం మారుతి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ కొత్త మారుతి బ్రెజ్జా కోసం కంపెనీ ఇప్పటివరకు లక్షా ఆరు వేలకు పైగా బుకింగ్‌లను పొందిందని, గత నెలలో కంపెనీ మొత్తం 15,193 బ్రెజ్జా కార్లను కస్టమర్లను డెలివరీ చేసిందని చెప్పారు.
బ్రెజ్జా వేరియంట్లు
మారుతి ఈ ఎస్‌యూవి నాలుగు వేరియంట్లలో వస్తుంది. వీటిలో LXi, VXi, ZXi అండ్ ZXi ప్లస్ ఉన్నాయి. ఈ ఎస్‌యూవిలో 1.5-లీటర్ K15C పెట్రోల్ ఇంజన్ ఇచ్చారు, ఈ ఇంజన్ 103 bhp అండ్ 137 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ ప్రకారం, కారు LXi అండ్ VXi మాన్యువల్ గేర్ వేరియంట్‌లు ఆవరేజ్ గా 20.15 kmpl మైలేజ్ ఇస్తాయి, ZXi ఇంకా ZXi ప్లస్ మాన్యువల్ గేర్ కారు ఆవరేజ్ గా 19.89 kmpl మైలేజ్ ఇస్తాయి. మాన్యువల్ కాకుండా ఆటోమేటిక్ గేర్ వేరియంట్ ఆవరేజ్ మైలేజ్ 19.80 kmpl ఇస్తుంది.
ఫీచర్లు
మారుతి ఎస్‌యూవిలో ఎన్నో స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి. మారుతి నుండి సన్‌రూఫ్ అందించిన మొదటి కారు కూడా ఇదే. సన్‌రూఫ్ కాకుండా ఈ ఎస్‌యూవిలో హెడ్స్-అప్ డిస్‌ప్లే, 360-డిగ్రీ వ్యూ కెమెరా, 22.86 సెం.మీ స్మార్ట్ ప్లే ప్రో ప్లస్ టచ్‌స్క్రీన్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో అండ్ ఆపిల్ కార్ ప్లే, క్రూయిజ్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, ABS, EBD వంటి ఫీచర్లు ఉన్నాయి.
ధర ఎంత
మారుతి బ్రెజ్జా ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ.7 లక్షల 99 వేలు. ఈ ధర కారు LXI వేరియంట్ కోసం. బ్రెజ్జా VXI వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 9 లక్షల 46 వేల 500. ZXI మాన్యువల్ గేర్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 10 లక్షల 86 వేల 500. ఆటోమేటిక్ గేర్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన VXI వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 10 లక్షల 96 వేల 500 కాగా, ZXI ఆటోమేటిక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 12 లక్షల 36 వేల 500. దీని టాప్ మోడల్ ZXI ప్లస్ మాన్యువల్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 12 లక్షల 30 వేలు, ఆటోమేటిక్ గేర్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 13 లక్షల 80 వేలు.